త్రిషకు తిరుచ్చి సీటు... విజయ్ షాకింగ్ డెసిషన్ ?
తమిళనాడు కొత్త సీఎం టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సినీ నటి త్రిష చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది.
తమిళనాడు కొత్త సీఎం టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సినీ నటి త్రిష చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పైనే మొత్తం కెమెరా అంతా ఫోకస్ పెట్టింది. ఆమె విజయ్ ప్రభుత్వంలో మరో పవర్ ఫుల్ సెంటర్ అవుతారు అన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వచ్చిన సందర్భంగా త్రిష తిరుపతి నుంచి ప్రసాదం తీసుకుని ఏకంగా విజయ్ ఇంటికే చేరుకోవడమూ అంతా చూశారు. ఇవన్నీ చూసినపుడు విజయ్ ప్రభుత్వంలో త్రిషకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఉంటుందని అంతా ఊహిస్తారు. అదే తమిళనాడు మీడియాతో పాటు అంతా రాసాయి.
రెండవ సీటు ఆమెకే :
ఇక విజయ్ రెండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి రెండూ గెలిచారు. అయితే తిరుచ్చి సీటుని ఆయన వదులుకున్నారు. ఇపుడు ఈ సీటు త్రిషకే ఇస్తారు అని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా వార్తా కధనాలు అల్లింది. ఇంకేముందు త్రిష ఇలా ఎమ్మెల్యే అవుతుంది అలా విజయ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూఒడా అవుతుందని రాతలు రాసుకొచ్చారు. కానీ ఇపుడు తిరుచ్చి సీటు విషయంలో విజయ్ త్రిష మీద జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టబోతున్నారు అని అంటున్నారు. ఈ సీటుని ఆయన మాజీ ఐఏఎస్ అధికారి సహయానికి ఇవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నీతికి నిజాయితీకి కట్టుబడిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి టీవీకే అభ్యర్ధిగా అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అని విజయ్ భావిస్తున్నారు అని చెబుతున్నారు. ఒక వేళ ఆయన పోటీకి నిరాకరిస్తే వేరే మాజీ ఐఏఎస్ లకు నిజాయతీకి పెద్ద పీట వేస్తూ ఇవ్వాలని విజయ్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో త్రిషకు ఈ సీటూ అంటూ వస్తున్న వార్తలకు కూడా ఈ విధంగా విజయ్ చెక్ పెట్టినట్లే అంటున్నారు.
తొలిసారి రాజ్యసభ :
అదేంటో విజయ్ పార్టీ అదృష్టమేమో కానీ ఇలా అధికారంలోకి వస్తూనే అలా రాజ్య సభ ఎన్నికలు వచ్చేశాయి. ఒక సీటు కూడా టీవీకే పరం కాబోతోంది. అన్నా డీఎంకే రెబెల్ నేత సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటుకు జూన్ 18న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీటు విషయంలోనూ త్రిషకు ముడి పెట్టి వార్తలు అల్లుతున్నారు. అయితే ఇక్కడ కూడా విజయ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని అంటున్నారు. టీవీకేకి తొలిసారిగా దక్కబోతున్న ఈ రాజ్యసభ సీటుని టీవీకేకి చెందిన ఒక అతి ముఖ్యమైన నాయకుడికి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు టీవీకేకి వెన్నుదన్నుగా ఉండే వారికే ఈ సీటు అన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
త్రిషకు నో చాన్స్ :
దీంతో త్రిషకు ఎక్కడా చాన్స్ లేనట్లే కనిపిస్తోంది. తమిళనాడులో శాసనమండలి అయితే లేదు. దాంతో ఎవరైనా చట్ట సభలకు వెళ్ళాలీ అంటే ఎమ్మెల్యే అయినా కావాలి లేదా రాజ్యసభకైనా వెళ్లాలి. ఇపుడు ఈ రెండు సీట్లూ ఖాళీలు వచ్చాయి కానీ త్రిష పేరు ఏ దశలోనూ విజయ్ పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. దాంతో త్రిష రాజకీయం అంటూ వస్తున్న వార్తలు అన్నీ ఒట్టివే అని టీవీకే అధినేత తేల్చేశారు అంటున్నారు. అంతే కాదు ఒకే ఒక పవర్ సెంటర్ అని ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయ్ చెప్పిన మాటలను కూడా గుర్తుంచుకోవాలని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.