ట్రంప్ కు అర్థమయ్యే భాషలో సైలెంట్ గా దెబ్బ కొట్టిన మోడీ సర్కార్

అదే పనిగా విరుచుకుపడటం.. తనకు నచ్చనట్లుగా వ్యవహరించే వారిని టార్గెట్ చేసే ట్రంప్.. ఆయా దేశాలకు పన్ను పేరుతో షాకివ్వటం.. ఆయా దేశాల్ని దారికి తెచ్చుకోవాలన్నట్లుగా ట్రంప్ తీరు ఉండటం తెలిసిందే.;

Update: 2026-01-18 05:22 GMT

అదే పనిగా విరుచుకుపడటం.. తనకు నచ్చనట్లుగా వ్యవహరించే వారిని టార్గెట్ చేసే ట్రంప్.. ఆయా దేశాలకు పన్ను పేరుతో షాకివ్వటం.. ఆయా దేశాల్ని దారికి తెచ్చుకోవాలన్నట్లుగా ట్రంప్ తీరు ఉండటం తెలిసిందే. సుంకం కత్తిని ఎడాపెడా వాడేస్తున్న ఆయనకు.. ఆయన భాషలోనే సమాధానం ఇవ్వటం.. ఆయన మాదిరి రంకెలు వేయకుండా.. సైలెంట్ గా తీసుకున్న నిర్ణయం తాజాగా వెలుగు చూసింది. అది కూడా అమెరికా సెనేటర్ ప్రస్తావించటంతో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సాకులతో సుంకం షాకిచ్చే ట్రంప్ నకు.. ఆయన మాదిరే.. భారీ ఎత్తున సుంకం షాకిచ్చిన మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు అమెరికా సెనేటర్లు కెవిన్ క్రేమర్, స్టీవ్ డెయిన్స్ లు. నార్త్ డకోటా.. మొంటానా రాష్ట్రాలకు చెందిన ఈ సెనేటర్లు దేశాధ్యక్షుడు ట్రంప్ నకు రాసిన లేఖ పుణ్యమా అని వెలుగు చూసింది.

ఈ లేఖ సారాంశం చాలా సింఫుల్. నవంబరు ఒకటి నుంచి భారత్ నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాన్ని విధించిన నేపథ్యంలో.. దానికి ప్రతిగా అమెరికా నుంచి భారత్ కు ఎగుమతి అయ్యే పప్పు ధాన్యాలపై భారత్ లోని మోడీ సర్కారు 30 శాతం సుంకాన్ని విధించిన వైనాన్ని వారు ప్రస్తావించారు. తమ రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేసే పప్పులు.. ముఖ్యంగా త్రణధాన్యాలకు ఈ టారిఫ్ లు పెను నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ త్రణ ధాన్యాల్ని ప్రపంచంలో అత్యధికంగా భారతీయులు మాత్రమే వినియోగిస్తున్న విసయాన్ని ప్రస్తావించారు. త్రణధాన్యాలపై మోడీ సర్కారు విదించిన 30 శాతం చాలా ఎక్కువగా వారు వాపోతున్నారు. ఈ సుంకం షాక్ ను ఎత్తి వేసేలా భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించిన లేఖ తాజాగా బయటకు రావటంతో మోడీ తీరును పలువురు అభినందిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పప్పులు.. త్రణధాన్యాల వినియోగంలో భారతదేశ వాటా 27 శాతం కావటం.. తాజాగా వాటిపై మోడీ సర్కారు విధించిన సుంకంతో తమ ప్రయోజనాలు దెబ్బ తింటున్నట్లుగా వారు చెబుతున్నారు. అమెరికాకు.. దాని అధ్యక్షుడు ట్రంప్ నకు అర్థమయ్యే భాషలోనే మోడీ సర్కారు సైలెంట్ గా దెబ్బేసినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ అమెరికాలో సాగు అయ్యే పప్పులపై సుంకాలు విధించటాన్ని గుర్తు చేస్తున్నారు,

2020లో భారత పర్యటన సందర్భంగా ట్రంప్.. తమ పప్పులపై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని కోరుతూ తానే స్వయంగా లేఖ ఇవ్వటం గమనార్హం. ఆ తర్వాతి కాలంలో సుంకాన్ని భారత్ తగ్గించింది. ఇటీవల కాలంలో తన పాత స్నేహితుడితో స్నేహపూర్వకంగా కాకున్నాసుంకంతో షాకులు ఇచ్చే ట్రంప్ కు అర్థమయ్యేలా భాషతోనే మోడీ మాట్లాడుతున్నట్లుగా చెప్పాలి. మరి.. ఈ వ్యవహారంపై ట్రంప్ ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు అసలు ప్రశ్న. ఇటీవల కాలంలో అమెరికా కోరుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలో త్రణధాన్యాలు.. పప్పుల వాటాను మరింత పెంచేలా అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందుకు తగ్గట్లే డీల్ కుదుర్చుకోవాలని భావిస్తుండగా.. మోడీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News