ట్రంప్ చెత్త.. ఇలాంటి నేతను చూడలేదు: తిరగబడ్డ సొంత నేతలు
ఈ సందర్భంగా తీర్మానం ప్రవేశ పెట్టిన డెమొక్రాట్ సీనియర్ సభ్యుడు గెర్గ్ మీక్స్ మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను చెత్తతో పోల్చారు.
అమెరికా చట్ట సభ సెనేట్‌లో దేశ అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా పలువురు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. 50 మంది సభ్యులు(సభకు హాజరైన వారిలో) తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 1973నాటి యుద్ధ వ్యతిరేక చట్టం ప్రకారం.. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏదేశంపైనైనా నిరవధికంగా యుద్ధాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సభ్యులు తీర్మానాన్ని తీసుకువచ్చారు. ఇది ఆమోదం కూడా పొందింది. ఫలితంగా ట్రంప్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి.
ఈ సందర్భంగా తీర్మానం ప్రవేశ పెట్టిన డెమొక్రాట్ సీనియర్ సభ్యుడు గెర్గ్ మీక్స్ మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను చెత్తతో పోల్చారు. ఇలాంటి చెత్త మనిషిని.. పాలకుడిని నేను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అమెరికా పరువును తీశారని అన్నారు. ఇలాంటి అధ్యక్షుడి పాలనలో అమెరికా పరువుతోపాటు.. ప్రాభవం కూడా కోల్పోతోందని అన్నారు. ఇరాన్‌పై నిరవధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అధ్యక్షుడికి విశేష అధికారాలను కట్టబెట్టలేదని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే అత్యున్నతమని.. దీని ప్రకారమే దేశం నడవాలని అన్నారు.
ఈయన ఒక్కరే కాదు.. రిపబ్లికన్(అధికార పార్టీ)కు చెందిన నలుగురు ఎంపీలు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ తీర్మానంపై ఓటే శారు. వారు కూడా సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు మీడియా పేర్కొంది. ఏకఛత్రాధిపత్యంగా(ఓన్లీవన్) వ్యవహరించడానికి ప్రజలు ఓటేయలేదని.. ట్రంప్ తన విధానాలను మార్చుకోవాలని తాము పదే పదే చెప్పామని వారు తెలిపారు. అయినా.. ట్రంప్ తన వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోవడం లేదని తెలిపారు. ఇది తమకు తీవ్ర అవమాన భారంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన విఫలమైన యుద్ధాన్ని ముగించినట్టు.. విజయవంతం అయినట్టు కలరింగ్ ఇస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎందుకిలా?
సొంత పార్టీ సభ్యులే ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం.. తీర్మానంపై అనుకూలంగా ఓటేయడం వంటి పరిణామాలు రాజకీయం గా సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే నవంబరులో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకున్న రిపబ్లికన్లు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాయిటర్స్ కథనంలో పేర్కొంది. అంతేకాదు.. ప్రజలు కూడా ట్రంప్ పాలనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్లలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్టు వివరించడం గమనార్హం.