డేటా డిలీట్ చేస్తే.. తాగునీరు.. ఓ దేశం వింత వ్యవహారం..

ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తమ దేశ వాసులకు ఒక ఆదేశం జారీ చేసింది. తమ మేయిల్స్ లోని డేటాను క్లీన్ చేయాలని కోరింది.;

Update: 2025-08-13 08:30 GMT

నీరు ప్రాణాధారం.. ఎక్కువ రోజులు ఆహారం ఉండకున్నా తట్టుకోవచ్చు కానీ నీరు లేకుంటే మాత్రం బతుకలేం. మునులు సైతం కమండలంలో నీరు పెట్టుకొని నోటిని తడుపుకుంటూ సంవత్సరాల పాటు ఘన పదార్థాలు తీసుకోకుండా తపస్సు చేస్తారు. నీరే జీవనాధారం. ప్రతీ ప్రాణి బతకాలంటే నీరు కావాల్సిందే. జీవం పుట్టింది కూడా నీటిలోనే కదా.. అందుకే నీటికి అంత ప్రాధాన్యత ఉంది. ఆర్థికంగా క్రైసస్ వస్తే తట్టుకోవచ్చు కానీ.. నీటి క్రైసస్ వస్తే మాత్రం తట్టుకోవడం సాధ్యం కాదు. చుట్టూ సముద్రాలు ఉన్న మన భారత్ లోని చాలా ప్రాంతాలకు అప్పుడప్పుడు నీటి గోస తప్పడం లేదు. ఇప్పుడు యూకే నీటి కోసం గోసపడుతుంది. దేశ వాసులకు తాగునీరు అందించేందుకు తిప్పలు పడుతుంది.

ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తమ దేశ వాసులకు ఒక ఆదేశం జారీ చేసింది. తమ మేయిల్స్ లోని డేటాను క్లీన్ చేయాలని కోరింది. డేటా క్లీన్ చేస్తే నీరు ఇస్తామని చెప్పింది. దీంతో దేశమే కాదు.. ప్రపంచం సైతం ఇదేంటంటూ ఆశ్చర్య వ్యక్తం చేశాయి. అవును డేటాలోని అక్కరకురాని ఫైల్స్ ను డిలీట్ చేస్తే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం..

డేటా స్టోరేజ్ సెంటర్లు ఈమేయిల్స్, ఫొటోలను భద్రపరిచేందుకు క్లౌడ్ వ్యవస్థను వినియోగించుకుంటారు. అంటే దీని కోసం పెద్ద పెద్ద డేటా సెంటర్లు అవసరం పడతాయి. అక్కడ పెద్ద పెద్ద కంప్యూటర్లు, సిస్టమ్స్ ఉంటాయి. భారీగా డేటాను స్టోరేజ్ చేస్తే అవి తొందరగా హీటెక్కుతాయి. వాటిని చల్లార్చేందుకు నీటిని పంపిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున నీరు వృథా అవుతుంది. పనికిరాని డేటాను తొలగిస్తే సిస్టమ్స్ హీట్ తగ్గుతుంది. దీంతో నీటి వినియోగం కూడా తగ్గుతుంది. డేటా సెంటర్లు రోజుకు 50 లక్షల గ్యాలన్ల వరకు నీటిని వినియోగించుకుంటాయి. ఈ నీరు 10వేల నుంచి 50వేల జనాభా ఉన్న పట్టణానికి సరిపోతుంది. అందుకే పనికిరాని వేస్ట్ ఫైల్స్, మేయిల్స్, ఫొటోలను డిలీట్ చేస్తే నీరు మిగులుతుందని అక్కడి ప్రభుత్వం చెప్పింది.

బ్రిటన్ నాలుగో హీట్ వేవ్ ను ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్ లోని ఐదు ప్రదేశాలలో అత్యధికంగా నీటి కరువు ఉంది. దీంతో పాటు మరో ఆరు ప్రదేశాల్లో కూడా కొద్దిపాటి కరువు ఉందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కరువును ఎదుర్కొనేందుకు వర్షం నీటిని సేకరించి నిల్వ ఉంచుకోవాలి. టాయిలెట్లు, వాష్ రూముల్లో లీకేజీలను నివారించాలి, వంటగది నీటిని మొక్కల పెంపకానికి ఉపయోగించాలి. ఇలా అనేక సూచనలు చేసింది.

Tags:    

Similar News