టీటీడీ కొత్త చైర్మన్ గా శ్రీనివాస రామానుజం?

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అత్యత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందువులకు ఎంతో గొప్ప క్షేత్రంగా పేరు ఉంది.

Update: 2026-10-06 03:02 GMT

ప్రపంచ దేవుడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు. ఆయన సన్నిధానంలో ఒక సెకన్ ఉన్నా జన్మ ధన్యం అని భక్తజనం కోట్లాదిగా తరలి వస్తుంది. అలాంటి చోట స్వామి సేవలో తరించేలా టీటీడీ చైర్మన్ పదవి అంటే ఎవరైనా సరే కోరుకుంటారు. ఏ జన్మ పుణ్య ఫలమో ఆ పదవి అని కూడా భావిస్తారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక తొలి చాన్స్ ఒక టీవీ అధిపతి అయిన బీఆర్ నాయుడుకు దక్కింది. ఆయన పదవి ఈ నవంబర్ 7వ తేదీకి పూర్తి అవుతోంది. అంటే సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అన్న మాట. దాంతో కొత్త చైర్మన్ ఎవరు అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. రకరకాలైన పేర్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నా కూడా ఒక పేరు అయితే దాదాపుగా ఖరారు అయింది అని అంటున్నారు.

ఇంతకీ ఎవరీయన :

ఇంతకీ శ్రీనివాస రామానుజం అంటే ఎవరీయన అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. అయితే ఆయన సామాన్యుడు కాదు, పారిశ్రామికవేత్తగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు లోకాద్రినాయుడు. ఆయన ఆధ్యాత్మిక వేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు శ్రీనివాస రామానుజం అన్న పేరుని పెట్టింది కూడా చిన్న జీయర్ స్వామి అని చెబుతున్నారు. రామానుజ మతం ఆయన స్వీకరించారు అని అంటున్నారు. అంతే కాదు ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజలం కలిగిన వ్యక్తిగా పేరుది. బీజేపీ అగ్ర నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఒక ముఖ్యమైన హోమాన్ని కూడా ఈయనే పర్యవేక్షించారు.

సరైన ఎంపికగా :

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అత్యత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందువులకు ఎంతో గొప్ప క్షేత్రంగా పేరు ఉంది. అలాంటి టీటీడీకి పాలక వర్గం చైర్మన్ గా ఉన్న వారు ఆధ్యాత్మిక నిష్టతో ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఏరి కోరి శ్రీనివాస రామానుజం పేరుని ఎంపిక చేశారు అని అంటున్నారు. ఈ రేసులో ఎంతో మంది పేర్లు వచ్చినా ఈయన వైపే మొగ్గు చూపడానికి కారణం ఆయన ఆధ్యాత్మిక భావనల పట్ల కూటమి పార్టీలు అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దలకు కూడా సంతోషం కలిగించవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

వివాదాలకు దూరంగా :

టీటీడీ అన్నది దైనందిన వార్తలలో ఉండేది కాకూడదన్నది కూటమి పట్టుదలగా ఉంది. ఏది జరిగినా ఏ చిన్న విషయం అయినా సరే పెద్దదిగా చూస్తున్నారు. అందుకే అక్కడ ఆధ్యాత్మికత మరింతగా పాదుకొలపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సరైన పాలకుడి చేతిలో బోర్డుని పెట్టాలని కూడా సంకల్పించింది అని అంటున్నారు. అందుకే అందరి మదిలో మెదిలిన ఒకే ఒక పేరు శ్రీనివాస రామానుజం అని అంటున్నారు. నవంబర్ 7న బీఆర్ నాయుడు పదవి పూర్తి అయిన వెంటనే ఈయన ఆ పదవిలోకి వస్తారు అన్నది ఇపుడు సాగుతున్న చర్చ.

Tags:    

Similar News