డెడ్ ఎకనామీ వర్సెస్ డెడ్ హ్యాండ్... ట్రంప్ కు షాకింగ్ కౌంటర్!

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సోవియట్‌ కాలం నాటి ఆటోమేటిక్‌ అణ్వాయుధ సామర్థ్యాలు కలిగి ఉందన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గుర్తించుకోవాలని అన్నారు.;

Update: 2025-07-31 17:51 GMT

భారత్ పై అమెరికా విధించిన 25శాతం సుంకాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన భారత వ్యాపార రంగంలో తీవ్ర కలకలం రేపింది! ఈ నేపథ్యంలో... మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ట్రంప్... తన అక్కసు వెళ్లగక్కుతూ.. రెండు దేశాలను 'చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు'గా ఎగతాళి చేశారు.. రష్యాతో కలిసి భారతదేశం ఏమి చేసినా తనకు డోంట్ కేర్ అని ప్రకటించారు.

ఇదే సమయంలో... రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్‌ పైనా విరుచుకుపడ్డారు. తమతో వాషింగ్టన్‌ గేమ్‌ ఆడుతుందని, అది యుద్ధానికి దారితీయొచ్చని దిమిత్రి హెచ్చరించడంపై ట్రంప్‌ స్పందించారు. ఇందులో భాగంగా... ఆయన ఇంకా అధ్యక్షుడిననే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో... ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్‌ మండిపడ్డారు. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అవును... భారత్ పై 25% సుంకాలకు సంబంధించిన ప్రకటన సమయంలో ట్రంప్, రష్యా - భారత్ లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత్‌ - రష్యాలు భారీ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాయని.. ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత పతనమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దిమిత్రి మెద్వెదెవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సోవియట్‌ కాలం నాటి ఆటోమేటిక్‌ అణ్వాయుధ సామర్థ్యాలు కలిగి ఉందన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గుర్తించుకోవాలని అన్నారు. ఇదే సమయంలో ఓ మాజీ అధ్యక్షుడి (తన) మాటలకు అమెరికా అధ్యక్షుడు (ట్రంప్) వణికిపోతున్నారని అన్నారు. ఇక.. భారత్‌, రష్యాలవి పతనమైన ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొనడంపై స్పందిస్తూ.. 'ది వాకింగ్‌ డెడ్‌' చిత్రాలను గుర్తించుకోవాలని తెలిపారు.

ఇదే సమయంలో... 'చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు', 'ప్రమాదకరమైన భూభాగం' విషయానికొస్తే బహుశా అతను తనకు ఇష్టమైన జోంబీ సినిమాలను తిరిగి చూసి.. ఉనికిలో లేని 'డెడ్ హ్యాండ్' ఎంత ప్రమాదకరమైనదో గుర్తుంచుకోవాలని.. రష్యా భద్రతా మండలి ఉప ఛైర్మన్‌ గా ఉన్న దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు.

కాగా... 'డెడ్‌ హ్యాండ్‌' అనే పదం పాశ్చాత్య దేశాల్లో కోల్డ్‌ వార్‌ కాలంలో వాడేవారట. అప్పట్లో ఇది అణు నిరోధక వ్యవస్థకు సూచిక అని చెబుతున్నారు. యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూ.ఎస్‌.ఎస్‌.ఆర్‌)పై ఏదైనా దాడి జరిగితే ప్రతీకారంగా ఈ ఆటోమేటిక్‌ వ్యవస్థ తక్షణమే స్పందించేందుకు దీన్ని రూపొందించారని చెబుతారు.

Tags:    

Similar News