‘నోబెల్’పై ట్రంప్ కన్ను.. రిక్వెస్ట్ కాదు.. డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను సృష్టించాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను సృష్టించాయి. భారత్-పాకిస్థాన్, ఇతర దేశాల మధ్య యుద్ధాలు, ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని, అందుకు ప్రతిఫలంగా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ “అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు ఉన్న విశ్వసనీయత వల్లే అనేక వివాదాలను పరిష్కరించగలిగాను” అని చెప్పారు. భారత్-పాకిస్థాన్ , థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణలను ఆపిన విషయం ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. భారత్-పాకిస్థాన్ సమస్యకు సంబంధించిన తన విధానాన్ని వివరిస్తూ “భారత్, పాకిస్తాన్‌ల విషయంలో యుద్ధం జరిగితే మనం వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశాను. రెండు దేశాలకు వాణిజ్యం అవసరం కావున, పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని చెప్పారు.
ట్రంప్ ప్రకారం.. అతను ప్రధానంగా ఏడు దేశాల మధ్య వివాదాలను ఆపేశాడు. వీటిలో భారత్-పాకిస్తాన్, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా-అజర్‌బైజాన్, కొసొవొ-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, రువాండా-కాంగోలు ఉన్నాయి. వీటిలో దాదాపు 60 శాతం వివాదాలు వాణిజ్య ఒత్తిడి వల్లే పరిష్కరించబడినట్లు ఆయన వెల్లడించారు.
భారత్‌కు ఇచ్చిన హెచ్చరికను వివరించగా “భారత్, పాకిస్తాన్‌లు అణుశక్తి దేశాలు. యుద్ధం జరిగితే అందరికీ నష్టం తప్పదు” అని ట్రంప్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంచి వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, యుద్ధ పరిష్కారం తాను ఊహించినంత సులభం కాదని చెప్పారు. అయినప్పటికీ ఈ సమస్యకు ఒక విధంగా పరిష్కారం కనిపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతేకాక ట్రంప్ తన ఘర్షణల పరిష్కారానికి నోబెల్ బహుమతి ఇచ్చే విధంగా ప్రతీ ఘర్షణకు ఒక్కొక్క నోబెల్ రావాలి అని సంతాపంగా పేర్కొన్నారు. ఇది నిజంగానే ఒక అద్భుతమైన, కానీ వివాదాస్పద అభ్యర్థనగా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు గురైపోతోంది.