అర్జున్ రెడ్డి, పుష్పల 'పటుత్వం' ఎంత? మన అపరిచితుడే తోపు అంటున్న డాక్టర్.. వైరల్ వీడియో
సినిమా థియేటర్లలో మన హీరోలు రఫ్ అండ్ టఫ్ లుక్కులతో చేతిలో సిగరెట్లతో.. నోట్లో గుట్కాలతో ఊరమాస్ డైలాగులు చెబుతుంటే "అబ్బా.. ఏం మగాడ్రా బుజ్జీ" అని ఈలలు వేసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు.
సినిమా థియేటర్లలో మన హీరోలు రఫ్ అండ్ టఫ్ లుక్కులతో చేతిలో సిగరెట్లతో.. నోట్లో గుట్కాలతో ఊరమాస్ డైలాగులు చెబుతుంటే "అబ్బా.. ఏం మగాడ్రా బుజ్జీ" అని ఈలలు వేసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. కానీ అదే హీరోల లైఫ్ స్టైల్‌ను మెడికల్ పరంగా చూస్తే వారి 'పురుష పటుత్వం' ఎంత? వారి స్పెర్మ్ కౌంట్ పరిస్థితి ఏంటి? అని ఓ లేడీ డాక్టర్ చేసిన పోస్ట్‌మార్టం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మన స్టార్ హీరోల క్యారెక్టర్లను బేస్ చేసుకుని.. ఆమె ఇచ్చిన రేటింగ్‌లు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
అర్జున్ రెడ్డి, పుష్ప.. స్క్రీన్‌పైనే ‘మగాళ్లు’.. మేటరొస్తే మైనస్
ఆల్కహాల్, గంజాయి, సిగరెట్లు దంచికొడుతూ అమ్మాయిల గుండెల్లో మంటలు పెట్టిన మన అర్జున్ రెడ్డి గారికి డాక్టర్ గారు ఇచ్చిన మార్కులు ఎంతో తెలుసా? మైనస్ 6/10. ఆయన వృత్తిరీత్యా డాక్టరే అయినా.. బాడీలోకి ఎక్కించే సరుకు వల్ల ఫర్టిలిటీ రేట్ పాతాళానికి పడిపోతుందని తేల్చేశారు. అంటే స్క్రీన్‌పై యాంగ్రీ యంగ్ మ్యాన్ అయినా.. రియల్ లైఫ్ కౌంట్‌లో మాత్రం సున్నా అన్నమాట..
ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మన పుష్పరాజ్ పరిస్థితి మరీ ఘోరం. రోజంతా అడవుల్లో కష్టపడుతూ, విటమిన్ డి గట్టిగానే పొందినా.. నోట్లో నిరంతరం నలిగే గుట్కా వల్ల ఆయనకు లభించిన స్కోరు కేవలం 1/10. "తగ్గేదే లే" అని కాలర్ ఎగరేసినా స్పెర్మ్ కౌంట్ విషయంలో మాత్రం పుష్ప ఘోరంగా తగ్గిపోయాడని డాక్టర్ గారు సెటైర్ వేశారు.
శారీరకంగా ఎంతో బలంగా ఉండే మన సలార్ దేవాకు దక్కింది 6/10 మార్కులే. ఎందుకంటే ఆయన ఉండేది బొగ్గు గనుల ఏరియా. ఆ హీటు, కాలుష్యం, దానికి తోడు స్మోకింగ్ అలవాటు వల్ల సలార్ కౌంట్ కూడా కాస్త ‘మధ్యస్థంగానే’ ఉంటుందట.
లీడర్లకు స్ట్రెస్ బాధలు.. పోలీస్ బాబుల డిసిప్లిన్
మంచి ఫిట్‌నెస్ ఉండి ఎలాంటి చెడు అలవాట్లు లేని 'భరత్ అనే నేను' సీఎం గారికి దక్కిన మార్కులు 7/10. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఉండే ప్రెజర్ ఆయన నెత్తిన ఉంటుంది కదా.. ఆ రేంజ్ స్ట్రెస్ ఉంటే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినక ఏమవుతుంది? అయితే సిక్స్ ప్యాక్ బాడీతో స్టెరాయిడ్స్ జోలికి వెళ్లకుండా డిసిప్లిన్‌గా ఉండే 'ధృవ' పోలీస్ ఆఫీసర్‌కు మాత్రం డాక్టర్ గారు 9/10 మార్కులు వేసి మంచి మార్కులతో పాస్ చేశారు.
అందరినీ మించిన 'తోపు'.. మన అపరిచితుడే
ఈ రేటింగ్‌లన్నింటిలో అందరికంటే టాప్‌లో నిలిచింది ఎవరో కాదు.. మన అపరిచితుడు.. రోజూ యోగా, ప్యూర్ వెజిటేరియన్ డైట్, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడం వల్ల ఆయనకు 9/10 రేటింగ్ ఇచ్చారు. రెమోలా లవర్ బాయ్ లుక్ ఇచ్చినా, అపరిచితుడిగా విలన్లను చీల్చి చెండాడినా.. హెల్త్ పరంగా ఆయనే రియల్ విన్నర్ అని తేలిపోయింది.
సినిమాల్లో హీరోలు స్టైల్‌గా సిగరెట్ కాలిస్తే అది ఫ్యాషన్ అనుకుని ఫాలో అయిపోతే.. నిజ జీవితంలో ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఈ డాక్టర్ గారు చాలా ప్రాక్టికల్‌గా.. కాస్త సెటైరికల్‌గా వివరించారు. సో బాస్.. స్క్రీన్ మీది హీరోల యాటిట్యూడ్ చూడటానికి బాగుంటుంది కానీ బాడీ పటుత్వం బాగుండాలంటే మాత్రం ‘అపరిచితుడి’ లాగా పద్ధతిగా ఉండక తప్పదు మరి.. అయితే ఇది కేవలం సినిమా పాత్రలపై చేసిన సరదా విశ్లేషణ మాత్రమేనని.. నిజమైన హెల్త్ కండిషన్ల కోసం డాక్టర్లను కలవడమే బెటర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.