ఇలా కూడా జరుగుతుందా: హైకోర్టు దిగ్భ్రాంతి.. రీజనేంటి?
ఇలా కూడా జరుగుతుందా.. అంటూ ఏపీ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము కూడా ఈ విషయం తెలిసి.. షాక్‌కు గురైనట్టు న్యాయమూర్తులు తెలిపారు.;
ఇలా కూడా జరుగుతుందా.. అంటూ ఏపీ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము కూడా ఈ విషయం తెలిసి.. షాక్‌కు గురైనట్టు న్యాయమూర్తులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. తాజా ఘటనలో అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు విచారణ చేయాలని కూడా పేర్కొంది. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో కూడా గుర్తించాలని అధికారులకు తేల్చి చెప్పింది.
విషయం ఏంటి?
తిరుమల శ్రీవారి కానుకల హుండీ పరకామణిలో 2021-22 మధ్య జరిగిన చోరీ ఘటన విచారణను ఏపీ సీఐడీ అధికారులు చేపట్టారు. దీనికి కోర్టే ఆదేశించింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించి తొలి రోజు (అంటే.. చోరీ చేసిన టీటీడీ అసిస్టెంట్ సీనియర్ మేనేజర్ రవికుమార్‌ను పట్టించింది) ఫిర్యాదు చేసింది అప్పటిటీటీడీ ఏవీఎస్‌వో.. సతీశ్ కుమార్. అయితే.. ఆ తర్వాత.. ఏం జరిగిందో ఏమో ఈ కేసు రాజీ మార్గాని కి వచ్చింది. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని 70 డాలర్ల స్థానంలో రవికుమార్ ఆస్తులను శ్రీవారికి రాసిచ్చా రు.
అయితే.. ఇలా ఎలా చేస్తారంటూ.. అందిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆది నుంచి సీరియస్ అయింది. దీంతో అధికారులు అప్పటి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసిన సతీశ్ కుమార్‌ను విచార ణకు పిలిచారు. ఈ క్రమంలో గత గురువారం రాత్రి పత్తికొండలో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కి..తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. మార్గ మధ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఆయన మృతదేహంగా మారారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీని వెనుక ఎవరున్నారన్న విషయంపై విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పరకామణి కేసు మరోసారి హైకోర్టులో విచారణకు రాగా.. న్యాయమూర్తులు ఈ వ్యవహారంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఒక విచారణ అధికారి కూడా ఇలా అవుతారని ఊహించలేదని పేర్కొంది. ఈ క్రమంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ సహా .. సాక్షులు ఎంత మంది ఉంటే అంతమందికి కూడా.. పటిష్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. అదేసమయంలో సతీశ్ మృతి కేసును కూడా త్వరగా విచారించి.. నిందితులను గుర్తించాలని సూచించింది.