• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో కొత్త లిక్కర్ ధరలు...

ఏపీలో కొత్త లిక్కర్ ధరలు ఇవే... తీవ్ర నిరాశలో మందుబాబులు!

| ఈ సమయంలో ఏపీలో నూతన మద్యం విధానం ద్వారా ఓపెన్ అయిన షాపుల్లో లిక్కర్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది.

By - Tupaki Desk
Update: 2024-10-16 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ మేరకు సోమవారం లాటరీల్లో కేటాయించిన షాపుల్లో అమ్మకాలు మొదలయ్యాయి. కొత్త సరుకులో వైన్ షాపులు కళకళలాడిపోతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏపీలో నూతన మద్యం విధానం ద్వారా ఓపెన్ అయిన షాపుల్లో లిక్కర్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది.

అవును... ఏపీలో బుధవారం ప్రైవేటు వైన్ షాపుల్లో రకరకాల పాత బ్రాండ్ల మధ్య బాటిళ్లు మెరవడం ప్రారంభించాయని మందుబాబులు సొషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలో... గత ప్రభుత్వ హయాంలో ధరలకూ.. ఇప్పటి ధరలకూ మధ్య వ్యత్యాసంపై వైన్ షాప్ పరిసరాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దామ్!

ఈ జాబితాలో ముందుగా విస్కీల విషయానికొస్తే... సథరన్ బ్లూ ఎలైట్ విస్కీ క్వార్టర్ ధర రూ.150.. బీ10 ఒరిజినల్ బ్లెండెడ్ విస్కీ క్వార్టర్ రూ.320.. ఆఫీసర్ ఛాయిస్ క్వార్టర్ రూ.150.. బీ7 క్లాసిక్ బ్లెండెడ్ విస్కీ క్వార్టర్ రూ.230.. రాయల్ స్టాగ్ విస్కీ క్వార్టర్ రూ.230.. బ్లెండర్స్ ప్రైడ్ క్వార్టర్ రూ.360.. 100 పైపర్స్ క్వార్టర్ రూ.670.. రాయల్ గ్రీన్ క్వార్టర్ రూ.220.. రాయల్ స్టాగ్ క్వార్టర్ రూ.230 గా ఉంది.

ఇదే సమయంలో... గోల్డెన్ స్ట్రిప్స్ విస్కీ క్వార్టర్ రూ.210.. మెక్ డొవెల్స్ నెం.1 విస్కీ క్వార్టర్ రూ.180.. రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ రూ.230.. 8పీఎం క్వార్టర్ రూ.230.. ఆల్ సీజన్స్ క్వార్టర్ రూ.210.. ఆస్ట్రోకార్ట్ ప్రీమియం క్వార్టర్ రూ. 230.. టీచర్స్ 50 క్వార్టర్ రూ.990.. గా విస్కీల ధరలు ఉన్నాయి!

ఇక బ్రాందీల ధరల విషయానికొస్తే... కైరోన్ రేర్ క్వార్టర్ రూ.300.. కింగ్స్ వెల్ క్వార్టర్ రూ.150.. కొరియర్ నెపోలియన్ క్వార్టర్ రూ.300.. మేన్సన్ హౌస్ క్వార్టర్ రూ.220.. మెన్సన్ హౌస్ ఆరెంజ్ క్వార్టర్ రూ.240.. మేన్సన్ హౌస్ గ్రీన్ ఆపిల్ క్వార్టర్ రూ.240.. మార్ఫస్ ఎక్స్వో క్వార్టర్ రూ.290.. రాయల్ ప్యాలెస్ ఫుల్ రూ.590.. గా ఉన్నాయి.

ఇదే క్రమంలో... రమ్ విషయానికొస్తే... ఓల్డ్ మంక్ ఎగస్ట్రా స్పెషల్ క్వార్టర్ రూ.230.. ఓల్డ్ మంక్ గోల్డ్నె రిసర్వ్ క్వార్టర్ రూ.270.. బకర్డీ కార్టా క్వార్టర్ రూ.330.. గా ఉన్నాయి. ఇక మేజిక్ మూమెంట్ వొడ్కా క్వార్టర్ రూ.230 కాగా.. జునో సుపీరియర్ పింక్ వొడ్కా క్వార్టర్ రూ.270 గా ఉంది.

ఇక బీర్ల ధరల విషయానికొస్తే... బ్లాక్ బాస్టర్ రూ.220.. కార్ల్స్ బెర్గ్ రూ.260.. కింగ్ ఫిషర్ రూ.200.. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ రూ.220.. బ్రిటీష్ ఎంఫైర్ రూ.220.. ఫోస్టర్స్ రూ.220 గా ఫిక్స్ చేశారు. దీంతో... గత ప్రభుత్వలో ఉన్న ధరలనే కంటిన్యూ చేశారు కాకపోతే వాటితో పాటు పాత బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయని వాపోతున్నారు మందు బాబులు!

తీవ్ర నిరాశలో మందుబాబులు:

ఏపీలో నూతన మద్యం పాలసి అమలులోకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తుల చేతిలో లిక్కర్ షాపులు వచ్చి చేరాయి. ఈ నేపథ్యలో బుధవారం నుంచి ఏపీలో వైన్ షాపులు తెరుచుకున్నాయి. అయితే... రూ.99కే క్వార్టర్ బాటిల్ అని ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇంకా ఆ బ్రాండ్స్ రాలేదని వైన్ షాపుల యజమానులు చెబుతున్నారట.

దీంతో... సణుగు కుంటూనో, గొణుగు కుంటూనో మళ్లీ పాత ధరలే రూ.120, రూ.150, రూ.180 చెల్లించి క్వార్టర్ బాటిల్స్ తీసుకెళ్తున్నారు. ఇక ఉన్నంతలో కాస్త కాస్ట్లీ తాగుతూ... రూ.220 క్వార్టర్ రూ.150 - రూ.180 మధ్య దొరుకుతుందని.. బీర్లు రూ.100 నుంచి 150 మధ్య దొరుకుతాయని భావించినవారు సైతం... మార్పులేని ధరలు చూసి ఫైరవుతున్నారని తెలుస్తోంది!

ఏది ఏమైనా... ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వచ్చింది. చీప్ లిక్కర్ సంగతి కాసేపు పక్కనపెడితే... చాలా వరకూ మద్యంపై పాత ధరలనే కంటిన్యూ చేస్తున్నారనే గుసగుసలు కాస్త బిగ్గరగానే వినిపిస్తుండటం గమనార్హం!!

Tags:    
  • Andhrapradesh 
  • Liquorshop 
  • Privatewineshops 
  • Newbrands 
  • Liquorlotteries 
  • Politicalnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS