రైతుల‌పై కేసులు.. టీ స‌ర్కారుకు మంచిదేనా?!

అన్న‌దాత‌లు అన‌గానే సెంటిమెంటుకు ప్రాధాన్యం ఉంటుంది. వారిని స‌మాజం కూడా సానుభూతి కోణంలోనే ప‌రిగ‌ణిస్తుంది.

Update: 2026-10-08 17:30 GMT

అన్న‌దాత‌లు అన‌గానే సెంటిమెంటుకు ప్రాధాన్యం ఉంటుంది. వారిని స‌మాజం కూడా సానుభూతి కోణంలోనే ప‌రిగ‌ణిస్తుంది. ఆరుగాలం శ్ర‌మించే రైతన్న‌ల కార‌ణంగానే కోటీశ్వ‌రుల నుంచి పేద‌ల వ‌ర‌కు ఓ గుప్పెడు అన్నం తిన‌గ‌లుగుతున్నార‌న్న సెంటిమెంటు ఎప్పుడూ లైవ్‌లోనే ఉంటోంది. అలాంటి రైతులతో పెట్టుకున్న ప్ర‌భుత్వాలు ఏవీ కూడా సానుభూతి పొందిన ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. గ‌తంలో రైతుల విష‌యంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఆ ప్ర‌భుత్వానికి మాయ‌ని మ‌చ్చ‌గా మారి.. ఎన్నిక‌ల వేళ గ్రామాల్లో తుడిచి పెట్టుకుపోయింది.

కాగా.. నేడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా రైతుల‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. వారిపై లాఠీ చార్జీలు చేయ‌డం వంటి వి స్థానికంగా గ్రామీణ ప్రాంతాల‌ను కుదిపివేస్తోంది. పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. స‌ర్కారుపై నిప్పులు చెర‌గ‌క‌పోయి నా అంత‌ర్గ‌తంగా మాత్రం తీవ్రస్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా జూరాల ప్రాజెక్టు కింద వ్య‌వ‌సాయం చేసుకునే రైతుల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. సుమారు 150 మందికిపైగా కేసులు న‌మోదైన‌ట్టు రైతులు చెబుతున్నారు. కానీ, అధికారులు మాత్రం 14 మందిపై కేసులు న‌మోదు చేసినట్టు తెలిపారు.

గ‌త నెలలో జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్న‌ప్ప‌టికీ.. రైతుల‌కు సాగు నీరు విడుద‌ల చేయ‌డంలో స‌ర్కారు మీన మే షాలు లెక్కిస్తోంద‌ని ఆరోపిస్తూ.. బీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు బ‌ల‌మై న క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకున్నా.. వంద‌ల సంఖ్య‌లో నిర‌స‌న కారులు ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకుని.. నిర‌స‌నలో పాల్గొన్నా రు. ఈ స‌మ‌యంలో రైతులు కూడా భారీగా త‌ర‌లి వ‌చ్చారు. కొంద‌రు రైతులు ఆగ్ర‌హానికి గురై జూరాల గేట్లు ఎత్తేశా రు. దీంతో 5 టీఎంసీల నీరు కిందికి(పొలాల్లోకి) పారింది.

దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఫ‌లితంగా ఇటు రైతుల‌పైనా.. అటు బీఆర్ ఎస్ నాయకుల‌పైనా కేసులు న‌మోదు చేసిన‌ట్టు తాజాగా అధికారులు వివ‌రించారు. రాజ‌కీయంగా నాయ‌కుల‌పై కేసులు న‌మోదు కావ‌డం స‌హ‌జ‌మే. వారు ఏదో ఒక విధంగా బ‌య‌ట‌కు వ‌స్తారు. కానీ, బ‌క్క‌చిక్కిన రైతుల‌పై కేసులు పెట్టి, స్టేష‌న్ల‌కు పిలిపించి.. రోజుల త‌ర‌బడి వేధించ‌డమే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వ్య‌వ‌హారం స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది. అదేస‌మ‌యంలో తాను కూడా రైతు బిడ్డ‌న‌ని చెప్పుకొనే సీఎం రేవంత్ వైఖ‌రిపైనా విమ‌ర్శ‌లు గుప్పిచేలా చేసింది.

Tags:    

Similar News