ప్రకాశం జడ్పీ వైస్ చైర్మన్ పదవికి డిమాండ్.. రిజర్వేషన్ తో మారిన సమీకరణాలు
ఈ క్రమంలో ప్రకాశం జడ్పీ వైస్ చైర్మన్ పదవికి రవీంద్ర బాబు హాట్ ఫేవరెట్ గా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో కీలకమైన జడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులతోపాటు మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి పదవులకు డిమాండ్ ఉంటుంది. అధికార పార్టీలో ఆయా పదవుల కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం జడ్పీ వైస్ చైర్మన్ పదవికి పోటీ తీవ్రంగా ఉంది. ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీలకు రిజర్వు చేయడంతో ఆ పదవిపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు ఇప్పుడు జడ్పీ వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఇందుకోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్నవారిలో జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోకూరి రవీంద్ర బాబు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కార్యకర్తే అధినేత అంటూ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన నినాదాన్ని నిజం చేసేలా తనకు అవకాశం ఇవ్వాలంటూ రవీంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని టీడీపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కార్యకర్తల పనితీరు ఆధారంగానే ఎంపికలు ఉంటాయని అధిష్టానం కూడా సూచించడంతో పలువురు నేతలు పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న సీనియర్ నేత పోకూరి రవీంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో కొత్తగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు అవకాశాలు వచ్చాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు కొత్త జిల్లాలుగా ఏర్పడటంతో ఆయా జిల్లాలో కొత్తవారికి అవకాశాలు లభించాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు పరిమిత సంఖ్యలో పదువులు ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలు విడిపోవడం వల్ల చాలా అవకాశాలు లభిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జడ్పీ వైస్ చైర్మన్ పదవికి రవీంద్ర బాబు హాట్ ఫేవరెట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి కేటాయించడంతో, వైస్ చైర్మన్ పదవికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు. ఈ కీలక పదవిని సొంతం చేసుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా, అందులో పోకూరి రవీంద్రబాబు ఒక్కసారిగా స్పీడు పెంచడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవీంద్రబాబు.. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుంటున్నట్లు చెబుతున్నారు. కష్టకాలంలోనూ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకులను గుర్తించాలని కోరుతూ ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకత్వానికి జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తూ ముందుకు వెళుతున్నారని అంటున్నారు.