'అక్కడ' టీడీపీ - జనసేన కలుస్తాయా.. ?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య పాలిటిక్స్ జరుగుతాయి.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య పాలిటిక్స్ జరుగుతాయి. ఇవి కామన్. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ ఇప్పట్నుంచే రెడీ అవుతుంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు, అదేవిధంగా ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం కనిపిస్తుంది. ఇక మరో జాతీయ పార్టీ బిజెపి ఇది కూడా తెలంగాణపై కన్నేసింది.
ఇక్కడ అధికారంలోకి రావడంతో పాటు పార్టీని డెవలప్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా టిడిపి- జనసేన పార్టీ విషయాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి. రెండు పార్టీలకు ఎదిగే అవకాశం ఉందన్న అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆయనకు అనుకూలంగా కొన్ని వర్గాలు వ్యవహరించడంతో టీడీపీకి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇక రెండోది. జనసేన పార్టీ అధినేత పవన్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మధ్య ఏర్పడిన వివాదం. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజంలో జనసేన పార్టీకి స్పష్టమైన విభజన కనిపించింది. జనసేన పార్టీ తరఫున సుమారు 200 మంది వరకు కార్యకర్తలు, నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించ డంతో పాటు పవన్ కళ్యాణ్‌ను సమర్థిస్తూ జనసేన పార్టీ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పటం విశేషం.
విషయం ఏదైనాప్పటికీ అటు టిడిపి ఇటు జనసేనలకు తెలంగాణలో అయితే స్కోప్ కనిపిస్తోందని, ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ అదేవిధంగా బిజెపి ఈ మూడు పార్టీలు మినహా సరైన ప్రత్యామ్నాయం తెలంగాణ సమాజానికి లేకపోవడం వంటివి ఆసక్తిగా మారాయి. ఇటీవల పార్టీ పెట్టిన కవిత కూడా స్పష్టమైన వైఖరితో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తెలంగాణ సమాజం కూడా వేచి చూస్తోంది.
దీనిలో టిడిపి- జనసేన రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తే కచ్చితంగా తెలంగాణ సమాజంలో ఈ రెండు పార్టీలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ రెండు కలిసి నడుస్తాయా లేవా అనేది చూడాలి. టిడిపి- జనసేన- బిజెపిలు ఏపీ ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో రాజకీయాలు చేయాలి అనుకుంటే ఈ మూడు పార్టీలు కలిసి చేస్తాయా అనేది కూడా ఒక ప్రశ్న.
భవిష్యత్తు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం కారణాలు ఏవైనప్పటికీ టిడిపిలోనూ జనసేన లోను జోష్ అయితే కనిపిస్తోంది. దీనిని ఉపయోగించుకుని సానుకూలంగా మలుచుకుని కార్యకర్తలను డెవలప్ చేసుకునే దిశగా అడుగులు వేస్తే ఈ రెండు పార్టీలకు తెలంగాణలో ప్రత్యామ్నాయ అవకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.