ఈ కార్లపై లక్షన్నర వరకు భారీ తగ్గింపు.. లిస్టులో మీ ఫేవరెట్ కారు ఉందేమో!

మరి జీఎస్టీ తగ్గుదలతో ప్రత్యేకించి టాటా కంపెనీ కొన్ని మోడల్స్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. మరి ఇందులో మీ ఫేవరెట్ కారు కూడా ఉందేమో ఇప్పుడు చూద్దాం;

Update: 2025-09-06 10:22 GMT

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలలో భారీ మార్పులు తీసుకురావడంతో ప్రత్యేకించి తాతా6 కార్లపై సుమారుగా లక్షన్నర వరకు భారీ తగ్గింపు ఉండనుంది అని తెలిసి సామాన్య ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి జీఎస్టీ తగ్గుదలతో ప్రత్యేకించి టాటా కంపెనీ కొన్ని మోడల్స్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. మరి ఇందులో మీ ఫేవరెట్ కారు కూడా ఉందేమో ఇప్పుడు చూద్దాం.

జీఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మేరకు టాటా కంపెనీ ఒక ప్రకటన వెలువడిస్తూ అన్ని మోడల్ కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే ఏ మోడల్ పై ఎంత మేరా తగ్గించింది అనే విషయానికి వస్తే.. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్న నేపథ్యంలో సుమారుగా 65 వేల నుంచి రూ.1.55లక్షల వరకు టాటా కార్లపై ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా టాటా కార్లలో ప్రధానంగా చెప్పబడే ఆల్ట్రోజ్, కర్వ్, సఫారీ, టియాగో, పంచ్, హారియర్ వంటి వివిధ విభాగాల వాహనాలపై ఇప్పుడు భారీగా తగ్గుదల కనిపిస్తోంది.

టాటా ఆల్ట్రోజ్: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అల్ట్రోజ్ పై రూ.1,10,000 తగ్గనుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ తగ్గింపు బెనిఫిట్ ని వినియోగదారులు పొందవచ్చు. ఇది పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులోకి వుంటుంది. ఇక దీని ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.6.89 లక్షలు.

టాటా కర్వ్: టాటా మోటార్స్ ఎస్ యు వి కూపే కర్వ్ మోడల్ పై సుమారుగా రూ.65,000 తగ్గనుంది. ఇది పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.10 లక్షల నుంచి మొదలవుతుంది.

టాటా సఫారీ: టాటా మోటార్స్ లో అత్యంత శక్తివంతమైన ఎస్ యు వి సఫారీ ధర రూ.1.45 లక్షలు తగ్గనుంది. ఇక దీని ఎక్స్ షోరూం ధర రూ.15.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా టియాగో: టాటా మోటార్స్ ఎంట్రీ లెవెల్ కారు టియాగో హ్యాచ్ బ్యాక్ ధర పై రూ.75,000 తగ్గనుంది. ప్రస్తుతం ఇది పెట్రోల్ , సీఎన్జీ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.5,00,000.

టాటా పంచ్: టాటా మోటార్స్ లో చౌకైన మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పంచ్ మోడల్ పై సుమారుగా రూ.85,000 తగ్గనుంది. ఇందులో పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.6 లక్షల నుంచి మొదలుకానుంది.

టాటా నెక్సాస్ : ఈ మోడల్ పై సుమారుగా రూ.1.55 లక్షలు తగ్గనుంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఎలక్ట్రిక్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.8లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా హారియర్: ఈ మోడల్ పై సుమారుగా రూ.1.40 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది డీజిల్, ఎలక్ట్రిక్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.15 లక్షల వద్ద ప్రారంభం కానుంది. మొత్తానికైతే టాటా కంపెనీ ఏకంగా రూ.1.55 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. మరి ఇందులో మీ ఫేవరెట్ కారు ఏదో చూసి సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోలు చేస్తే కచ్చితంగా ఆఫర్ వర్తిస్తుంది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News