త‌మ్మినేని బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌.. అవాక్క‌యిన పోలీసులు!

పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చేముందు సీతారాం స‌తీమ‌ణి వాణిశ్రీ.. ఆయ‌నకు వీర‌తిల‌కం దిద్ద‌డం వైసీపీ శ్రేణు ల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Update: 2026-07-29 19:37 GMT

మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. ఆయ‌న స‌తీమ‌ణి వాణి శ్రీలు.. బుధ‌వారం శ్రీకాకుళం జిల్లా రూర‌ల్ పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు.. వారు భూక‌బ్జా కేసును విచారిస్తున్న అధికారి ముందు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ సంద‌ర్భంగా మందీ మార్బ‌లంతో స్టేష‌న్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌గా రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనివ‌ల్ల జాతీయ ర‌హ‌దారికి అనుబంధంగా ఉన్న రోడ్ల‌న్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఫ‌లితంగా సాధార‌ణ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు.

పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చేముందు సీతారాం స‌తీమ‌ణి వాణిశ్రీ.. ఆయ‌నకు వీర‌తిల‌కం దిద్ద‌డం వైసీపీ శ్రేణుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇదిలావుంంటే ఆయన కుటుంబం మీద .వచ్చిన ఆరోపణల ప్రకారం బ‌తికి ఉన్న వ్య‌క్తిని చ‌చ్చిపోయాడంటూ త‌ప్పుడు స‌ర్టిఫికెట్ సృష్టించారు. అత‌నికి చెందిన భూమిని ఒడిశాకు చెందిన మ‌రో మ‌హిళ ర‌మాదేవిగా పేర్కొంటూ .. త‌మ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ త‌న పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఈ వ్య‌వ‌హారం ఇటీవ‌ల వెలుగు చూడ‌డంతో బాధితుల ఫిర్యాదు మేర‌కు.. పోలీసులు కేసు న‌మోదు చేశారు.

దీంతో త‌మ్మినేని ఫ్యామిలీ ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చింది. అయితే.. చిరంజీవి నాగ్‌కు మాత్రం ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. అదేస‌మ‌యంలో త‌మ్మినేని, ఆయ‌న స‌తీమ‌ణి మాత్రం విచార‌ణాధికారి పిలిచిన‌ప్పుడు స్టేష‌న్‌కు వెళ్లాల ని.. స‌హ‌క‌రించాల‌ని.. తెలిసిన విష‌యాల‌ను దాప‌రికం లేకుండా చెప్పాల‌ని ఆదేశించింది. ఈ ష‌ర‌తుల ను మీరితే ముంద‌స్తు బెయిల్‌ను ర‌ద్దు చేస్తామ‌ని కూడా హైకోర్టు హెచ్చ‌రించింది.

ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం త‌మ్మినేని త‌న నివాసం నుంచి మందీ మార్బ‌లంతో స్టేష‌న్‌కు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న చేప‌ట్టిన ర్యాలీకి అనుమ‌తి లేద‌ని పోలీసులు చెబుతున్నారు. దీనిపై ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుంటామ‌న్నారు. మ‌రోవైపు.. గంట సేపు స్టేష‌న్‌లోనే ఉన్న త‌మ్మినేని అధికారి ముందు రిజిస్ట‌ర్‌లో సంత‌కం చేసి వెళ్లారు. త‌న‌కు ఈ కేసుకు సంబంధం లేద‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం త‌మ‌ను వేధిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. దీనిని న్యాయ ప‌రంగానే తేల్చుకుంటామ‌న్నారు.

Tags:    

Similar News