సుజనా చౌదరి మాటలకు అర్ధాలు వేరేనా ?

ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అని ఒక సామెత ఉంది. దానికి కొంత మార్చి చదువుకుంటే రాజకీయ నేతల మాటలకు కూడా అర్ధాలు వేరు అని సౌండ్ వస్తుంది.;

Update: 2025-10-01 03:44 GMT

ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అని ఒక సామెత ఉంది. దానికి కొంత మార్చి చదువుకుంటే రాజకీయ నేతల మాటలకు కూడా అర్ధాలు వేరు అని సౌండ్ వస్తుంది. వివిధ సందర్భాల నేపధ్యాన్ని బట్టి వారి మాటలకు అర్ధాలను పొలిటికల్ డిక్షనరీలో వెతుక్కోవాల్సి ఉంటుంది. కూటమి కట్టారు, అధికారంలోకి వచ్చారు అంతవరకూ బాగానే ఉంది కానీ మూడు పార్టీలు ఎంతో మంది నాయకులు మరెన్నో ఆశలు తీరా చూస్తే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. దాంతోనే చాలా మందిలో అసంతృప్తి మెల్లగా మొదలై అది అక్కసుగా మారి ఎటు దారి తీరుస్తుందో అన్న చర్చ అయితే సాగుతోంది.

జస్ట్ ఎమ్మెల్యేగానే :

ఆయన మామూలు నాయకుడు కాదు, రెండు సార్లు పెద్దల సభకు ఎంపికైన నేత. ఆయనే సుజనా చౌదరి. కేంద్రంలో ఆయన మంత్రిగా సైతం పనిచేశారు. తెలుగుదేశం లో ఉన్నపుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవారు. అయితే బీజేపీలోకి వెళ్ళి కూడా కేంద్ర మంత్రి కాలేకపోయారు చివరికి రాజ్యసభ సీటుని మరోసారి రెన్యూవల్ చేయించుకోలేకపోయారు. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తే చివరాఖరున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ని బీజేపీ కోటాలో ఇచ్చారు. సరే రాష్ట్ర మంత్రి అయినా కావచ్చు అని బరిలోకి దిగారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచినా అలాగే ఉండిపోయారు. దాంతో ఆయనలో అసహనం పెరిగిపోతోంది అని అంటున్నారు.

వైసీపీ పాలనగానే :

తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనగానే తనకు కూటమి పాలన అనిపిస్తోంది అని తన బాధను వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరగడం లేదని ఒక ఇష్యూని ప్రస్తావించారు. రుషికొండ భవనాల మీద విమర్శలేనా అధికారంలోకి వచ్చినా ఎందుకు వినియోగించుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. ఇలా కూటమి ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టినట్లుగానే ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు.

అయిదేళ్ళూ ఇంతేనా :

ఇక అధికారంలోకి వచ్చి ఏణ్ణర్థం దగ్గర కావస్తోంది అని మరో మూడున్నరేళ్ళు ఇట్టే గడచిపోతాయని సుజనా చౌదరి అయితే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన రాజ్యసభ సీటుని ఆశించారు అంటారు. అయితే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి తీసుకోవడం అంత సులువు కాదు, ఇక మంత్రిగా చోటు ఇవ్వాలంటే సామాజిక సమీకరణలు సరిపోవని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా అయినా చాన్స్ ఇస్తారు అనుకుంటే ఆ పదవి కాస్తా ఉత్తరాంధ్రాకు చెందిన మాధవ్ కి వెళ్ళిపోయింది. మూడేళ్ళ పాటు ఆయనే కొనసాగుతారు అని అంటున్నారు.

ఈ టెర్మ్ ఇంతేనని :

దాంతో కేవలం ఎమ్మెల్యేగానే ఆయన ఉండాల్సి వస్తోంది అన్నది ఆయనతో పాటు అనుచరుల ఆవేదనగా ఉందిట. దాంతోనే ఆయన మధనపడుతున్నారని అది కస్తా అసెంబ్లీ సమావేశాలలో కొంత ఈ విధంగా బయటపెట్టారు అని అంటున్నారు. అయితే ఆయన ఏమి మాట్లాడినా ఎలా తన బాధను వ్యక్తం చేసినా ఈ టెర్మ్ ఇంతేనని అంటున్నారు. మరి వచ్చేసారి ఎలా ఉంటుందో రాజెవరో మంత్రి ఎవరో ఇవన్నీ తలచుకునే ఆయన ఇలా మాట్లాడుతున్నారా అని అంటున్నారు.

Tags:    

Similar News