ఒంటరి మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు? సర్వేలో విస్తుపోయే నిజాలు!

దేశంలోనే ఒంటరి మహిళల శాతంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Update: 2026-06-09 07:40 GMT

మారుతున్న కాలంతో పాటు సమాజంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు భర్తతో విభేదాలు వచ్చినా సర్దుకుపోయే మహిళలు, ఇప్పుడు తమ ఆత్మగౌరవం కోసం విడిగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే భర్త లేకుండా విడాకులు, లేదా విడిపోవడం, వితంతువులు ఇలా ఒంటరిగా జీవిస్తున్న మహిళలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన తాజా ఎస్ఆర్ఎస్ స్టాటిస్టికల్ రిపోర్ట్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. దేశంలోనే ఒంటరి మహిళల శాతంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒంటరి మహిళల్లో తమిళనాడు టాప్:

తాజా నివేదిక ప్రకారం.. భర్తకు దూరంగా లేదా ఒంటరిగా జీవిస్తున్న మహిళల్లో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే 11.6 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 10.4 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరి 8.6 శాతంతో మూడో స్థానంలో ఉండగా, తెలంగాణ 7.6 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక ఈ గణాంకాలను బట్టి చూస్తే ఉత్తరాదితో పోలిస్తే సౌత్ స్టేట్స్‌లోనే ఒంటరి మహిళలు ఎక్కువగా ఉన్నారని స్పష్టమవుతోంది.

మారిన ఆలోచనలు.. పెరిగిన స్వేచ్ఛ:

దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ధోరణి పెరగడానికి నిపుణులు పలు ఆసక్తికరమైన కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మహిళల్లో చదువు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. పెరిగిన విద్యావంతుల శాతం వల్ల మహిళలు తమ హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటున్నారు. ఇక పాతకాలం నాటి అణచివేత ధోరణిని భరిస్తూ,భర్త ఎమన్నా మోనంగా తనలో తాను బాధ పడటం అనేది ఇప్పుడు కనుమరుగవుతుంది. ఇక భార్యాభర్తల బంధాన్ని భారంగా లాగడం కంటే, ప్రశాంతంగా ఒంటరిగా జీవించడమే మేలని నేటి తరం మహిళలు భావిస్తున్నారు.

ఆర్థిక స్వయంసమృద్ధి.. భావోద్వేగ సవాళ్లు:

ఒంటరిగా ఉండటానికి మరో ప్రధాన కారణం.. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడటం. సాఫ్ట్‌వేర్, బిజినెస్, కార్పొరేట్ రంగాల్లో మహిళలు రాణిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. దీనివల్ల భర్తతో సరిపడకపోయినా, ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదనే ధీమా వారిలో కనిపిస్తోంది. అయితే, ఇలా విడిగా ఉంటున్న మహిళలు ఆర్థిక సవాళ్లు దాటుకొస్తున్నప్పటికీ.. సమాజం చూసే కోణం వల్ల తీవ్రమైన భావోద్వేగ మార్పులను, ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒకప్పుడు విడాకులు లేదా విడిపోవడం అంటే సమాజంలో ఒక పెద్ద తప్పుగా చూసేవారు. కానీ నేటి తరం ఒంటరి మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడుతూ, ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు సాగుతున్నారు. ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ఇచ్చిన ఈ గణాంకాలు మహిళల స్వతంత్ర జీవన శైలిని సూచిస్తున్నప్పటికీ.. కుటుంబ బంధాల మధ్య పెరుగుతున్న దూరాన్ని కూడా కళ్లకు కడుతున్నాయి.

Tags:    

Similar News