ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియా ఎంట్రీ...ఫస్ట్ పోస్ట్ ఏంటంటే !

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియా ఎంట్రీ ఇచ్చారు.

Update: 2026-10-23 03:17 GMT

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియా ఎంట్రీ ఇచ్చారు. తద్వారా సోషల్ మీడియాతో మరింత చేరువ కానున్నారు. ఆమె సోషల్ మీడియా కనెక్షన్ ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ కాంగ్రెస్ అభిమానులతో పాటు అందరిలో ఉండగానే తొలి పోస్ట్ ఒకటి పెట్టి మరింత సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఆ మొదటి పోస్ట్ దేని గురించి అంటే తన మొత్తం జీవితం గురించి. ఆమె జీవితానికి సంబంధించి రూపొందించిన బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్. ఈ బుక్ నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలా తన లైఫ్ ని మొత్తం తెలియచేసే బుక్ తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియా ఎంట్రీ ఇచ్చారు అన్న మాట.

నా జ్ఞాపకాల పుస్తకం అంటూ :

సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ పరిచయం చేశారు. హలో అందరికీ... ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఇది ప్రేమ, బాధ్యత నష్టం మనకంటూ ఒక చోటును వెతుక్కునే ప్రయాణానికి సంబంధించిన కథ అని బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ ని ఆమె పరిచయం చేశారు. దీనిని మీతో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సోనియాగాంధీ పేర్కొన్నారు.

సోనియా మొత్తం జీవితం :

ఈ రోజున సోనియా గాంధీ 80 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఆమె ఇటలీకి చెందిన వారు అన్నది తెలుసు. కానీ ఆమె జీవితంలో అత్యధిక భాగం భారత్ లోనే గడచింది. ఇక ఆమె ఈ బుక్ లో రాసిన దాని ప్రకారం ఆమె బాల్యం, నుంచి ఈ రోజు వరకూ జరిగిన అనేక సంఘటనలు మరచిపోలేనివి అన్ని ఉంటాయి. అంతే కాదు ఆమెకు రాజీవ్ గాంధీతో తొలి ప్రేమ, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న సమయంలో ఏర్పడిన స్నెహాం కాస్తా ప్రేమగా ఎలా మారింది, ఇక సోనియా గాంధీ పెళ్ళి నాటికే భారత్ కి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీతో ఆమె ఎలా గడిపారు, అత్తాకోడళ్ల మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది, ఇక ఇందిరా గాంధీ దారుణ హత్య, ఆ తరువాత ఏడేళ్ళకే రాజీవ్ గాంధీ హత్య ఇలా వెంట వెంటనే విషాదాలు తీవ్రంగా మనసుని కలచివేసిన ఘటనలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి అంటున్నారు. అంతే కాదు భారత్ తో సోనియాకు ఉన్న బంధం ఎలా ముడిపడింది, ఎలా అది మరింత గాఢంగా పెనవేసుకుంది అన్నది కూడా ఈ పుస్తకంలో ఉంది.

టీనేజ్ లోనే :

ఇక సోనియా వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆమె కేవల 19 ఏళ్ళ వయసులోనె అంటె 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని కలుసుకున్నారు. ఆ తర్వాత 1968 ఫిబ్రవరి 25న వీరి వివాహం జరిగింది. అప్పటికి ఆమె వయసు సరిగ్గా 22 ఏళ్ళు. అంటే 58 ఏళ్ళుగా భారత్ నే తన ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నారు అన్న మాట. ఇక సోనియాగాంధీకి రికార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా సేవలందించిన నేతగా ఆమె రాజకీయ చరిత్రలో నిలిచారు. నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యురాలిగా ఆమె ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలు, భారతదేశంలో ఆమె జీవిత ప్రస్థానం అంతా ఈ బుక్ లో ఉండబోతోంది. ఇలా తన జీవిత చరిత్రను ఒక వైపు తెస్తున్న సోనియా అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వడంతో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది అని చెప్పాలి.




Tags:    

Similar News