• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాతికేళ్లలోపు యువతులు ...

పాతికేళ్లలోపు యువతులు బిడ్డను కంటే రూ.92 వేలు!

| తమ తమ దేశాల్లో రోజు రోజుకీ పడిపోతున్న సంతానోత్పత్తి పలు దేశాలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది.

By - Tupaki Desk
Update: 2024-07-13 02:45 GMT

లేనివాడికి ఆకలి బాధ అయితే.. ఉన్నవాడికి అజీర్తి బాధ అని అంటారు! కొన్ని దేశాలు అధిక జనాభాతో ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని దేశాలు రోజు రోజుకీ పడిపోతున్న జనాభాతో సమస్యలు ఎదుర్కొంటుంటాయి. దీంతో... సరికొత్త ఆలోచనలు చేసి, వివాహిత దంపతులకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి వ్యవహారమే ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది.

తమ తమ దేశాల్లో రోజు రోజుకీ పడిపోతున్న సంతానోత్పత్తి పలు దేశాలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే కొంతకాలం తర్వాత దేశం నిండా వృద్ధులే ఉంటారని ఆందోళన చెందుతున్నాయి. సరాసరిన ఓ మహిళ ఒక్క బిడ్డకు కూడా జన్మను ఇవ్వడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రష్యా సరికొత్త ఆలోచన చేసింది. ఇప్పుడు ఈ ఆలోచన ఆసక్తిగా మారింది.

అవును... తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా పలు చర్యలు చేపడుతోంది. తాజాగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా... స్థానిక యూనివర్శిటీ, కాలేజీలలో చదివే 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కనుక ప్రసవిస్తే వారికి రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.

ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచడానికి రష్యా ఇలాంటి ఆలోచనలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే రష్యా, దాని రీజియన్ ప్రాంతాలు జననాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా దేశంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్‌ లు, మాత్రలపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలుస్తుంది.

మరోపక్క ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాలోని పలువురు యువకులు మరణించగా.. బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారనే భయంతో చాలా మంది ఇప్పటికే దేశాన్ని వదిలి పారిపోయారని అంటున్నారు. కాగా... ప్రతీ రష్యా మహిళ కనీసం 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది డిసెంబర్ లో పుతిన్ విజ్ఞప్తి చేశాడు.

Tags:    
  • WorldPopulation 
  • RussiaUkraineWar 
  • Russia 
  • Ukraine 
  • RussiaPopulation 
  • Births 
  • Deaths 
  • Putin 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS