తరుముకొస్తున్న అలలు, తరలి వెళ్తున్న ప్రజలు.. వైరల్ వీడియో!
తాజాగా అమెరికాలోని హవాయి రాష్ట్రం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీ అవ్వగా.. ఒక్కసారిగా సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో... ఆ రాష్ట్రంలోని పర్యాటకులు, స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.;
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ సమయంలో పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రంతాలకు తరలివెళ్తుండగా.. అమెరికాలోని వీడియో వైరల్ గా మారింది.
అవును... రష్యాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా జపాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. ఆ ప్రాంతాంలో సుమారు ఆరు అడుగుల ఎత్తు వరకు అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రం మొత్తం ఖాళీ అవుతుంది.
తాజాగా అమెరికాలోని హవాయి రాష్ట్రం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీ అవ్వగా.. ఒక్కసారిగా సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో... ఆ రాష్ట్రంలోని పర్యాటకులు, స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారిగా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా స్పందించిన అమెరికా వాతావరణ విభాగం... సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని.. ఫొటోలు, వీడియోల కోసమని సముద్ర తీరానికి వెళ్లొద్దని తెలిపింది. పైగా... ఒకటి రెండు అలలతో సునామీ రాదని.. అలలు పెద్దసంఖ్యలో వస్తాయని.. వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఈ సమయంలో తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది.
భారత్ కు సునామీ ముప్పుపై ఇన్ కాయిస్ వివరణ!:
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం ప్రభావంతో రష్యా, జపాన్ తీరప్రాంతాలను సునామీ తాకింది. ఈ క్రమంలో భారత్ కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్ కాయిస్) పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసింది.
మరోవైపు.. అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సునామీ హెచ్చరిక జారీ అయితే ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని పేర్కొంది. ఈ సందర్భంగా కాన్సులేట్ హెల్ప్ లైన్ నంబర్ (+1 (206) 608-0608) ను కూడా జారీ చేసింది.