రోజమ్మ ప్లాన్ బీ...వైసీపీకి బీపీ ?
ఫైర్ బ్రాండ్ లేడీగా ఆర్కే రోజాను చెబుతారు. ఆమె సినీ కెరీర్ ఒక దశాబ్దం పాటు పీక్స్ లో సాగింది.;
ఫైర్ బ్రాండ్ లేడీగా ఆర్కే రోజాను చెబుతారు. ఆమె సినీ కెరీర్ ఒక దశాబ్దం పాటు పీక్స్ లో సాగింది. ఆమె టాప్ స్టార్స్ అందరితోనూ టాలీవుడ్ లో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2000 తరువాత ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా టీడీపీ నుంచి. 2004 లో తొలిసారి ఆమె చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2009లో రెండోసారి అదే సీటు నుంచి పోటీ చేసి ఓడిన తరువాత టీడీపీకి దూరం జరిగారు. కాంగ్రెస్ లో చేరే ప్రయత్నంలో ఉండగానే వైఎస్సార్ మరణించారు. ఇక వైఎస్ జగన్ పార్టీలో ఆమె చేరి 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే ఊపులో 2019లో మరోసారి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. 2024లో మాత్రం ఆమె ఓటమి పాలు అయ్యారు. ఇలా వైసీపీ నుంచి మూడు సార్లు టికెట్ తెచ్చుకుంటే రెండు సార్లు విజయం వరించింది.
నగరిలో రివర్స్ :
ఇక 2019 తరువాత నగరిలో క్యాడర్ కి ఆమెకు మధ్య ఒక గ్యాప్ అన్నది పెరిగిపోయింది అని అంటారు. దాంతో 2024లో ఆమెకు టికెట్ ఇవ్వవద్దు అని ఒక వర్గం పట్టుబట్టింది. అయితే జగన్ మాత్రం తన ఇమేజ్ తో ఆమె గెలుస్తుంది అని భావించి ఇచ్చారు. కానీ ఓటమి పాలు అయ్యారు. దాంతో పాటు గడచిన రెండేళ్ళుగా రోజా ఏపీ పాలిటిక్స్ లో అంత కీలకంగా ఉండడం లేదు, దాంతో నగరిలో వైసీపీ యాక్టివిటీస్ తగ్గి పార్టీ వీక్ అవుతోంది. మరో వైపు టీడీపీ అక్కడ బలంగా తయారు అవుతోంది. నిజానికి నగరి సీటు టీడీపీకి కంచుకోట. అక్కడ నుంచి అనేకసార్లు ముద్దు క్రిష్ణమ నాయుడు గెలిచారు ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉంటున్నారు దాంతో టీడీపీకి పట్టు చిక్కింది. వైసీపీకి సరైన లీడర్ షిప్ లేకపోతే ఏకపక్షం అవుతుందని నగరి పాలిటిక్స్ సూచిస్తోంది. దాంతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అవుతోంది అంటున్నారు.
కొత్త ఇంచార్జితో :
ఇక నగరిలో కొత్త ఇంచార్జిని తీసుకుని వచ్చి పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. రోజా విషయం తీసుకుంటే 2029 లో పార్టీ పవర్ లోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని చెబుతారు అని అంటున్నారు అయితే రోజా పట్టుదల కలవారు కావడంతో ఎక్కడా తగ్గేది ఉండదని అంటున్నారు దాంతోనే ఆమె ఈ విషయాల మీద పూర్తి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. అలా ఆమె ప్లాన్ బీతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. అందులో భాగమే ఆమె తమిళనాడులో డీఎంకేకు ప్రచారం చేయడం అంటున్నారు రేపటి రోజున డీఎంకే గెలిస్తే అపుడు ఆ ప్రభుత్వంలో మంచి అవకాశాలు వస్తాయని చూస్తున్నారు అని అంటున్నారు.
తమిళనాడులోనూ స్టార్ గా :
రోజా తెలుగు తమిళ మూవీస్ ఎక్కువగా చేశారు. ఆమె భర్త సెల్వమణి కూడా తమిళ దర్శకుడు. స్టాలిన్ కుటుంబంతో రోజా ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు దాంతో వైసీపీ కనుక నో చెబితే తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని రోజా చూస్తున్నారని అంటున్నారు. వైసీపీకి ఈ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇపుడే ఎవరూ చెప్పలేరని అంటున్నారు ఆమె తమిళనాడుకు షిఫ్ట్ అయితే ఇండియా కూటమిలోకి నేరుగా వచ్చిన వారు అవుతారు దాంతో ఏపీ మీద కూడా ఆమె రాజకీయ ఫోకస్ పెడితే అది వైసీపీకి ఇబ్బందిగా మారుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఆర్కే రోజా రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయో. ఈ ప్రచారం ఎలాంటి ఎండ్ కి చేరుకుంటుందో.