డ్రోన్లతో గిన్నిస్ రికార్డు.. రేవంత్ సర్కార్ ఘనత

అధికారం చేతిలో ఉన్నప్పటికి అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం చాలా తక్కువ మంది పాలకులకు మాత్రమే దక్కుతుంది.;

Update: 2025-12-10 04:45 GMT

అధికారం చేతిలో ఉన్నప్పటికి అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం చాలా తక్కువ మంది పాలకులకు మాత్రమే దక్కుతుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ స్టైల్ వేరుగా ఉంటుంది. మిగిలిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు భిన్నంగా పాలనతో తనదైన మార్కును ప్రదర్శించటంతో పాటు.. అందుకోసం ఎంత శ్రమకైనా వెనుకాడని తీరు కనిపిస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం రైజింగ్ తెలంగాణ నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్.. అందుకు తగ్గట్లే రెండు రోజుల కార్యక్రమాన్ని మంగళవారంతో పూర్తి చేశారు.

అనుకున్నదానికంటే ఎక్కువ పెట్టుబడుల్ని ఆర్షించటంతో పాటు.. ఈ ప్రోగ్రాం చివరి రోజున భారీ ఎత్తున డ్రోన్లతో చేపట్టిన చర్యలు ఎందరినో ఆకర్షించాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి వేళలో మూడు వేల డ్రోన్లతో షోను నిర్వహించారు. ఇందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు క్రాక్ చేయటం విశేషం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలను వివరించే థీమ్ లతో 3వేల డ్రోన్ లతో షోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచాను కాల్పారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గతంలో ఇదే తరహాలో అబుదాబిలో డ్రోన్ల ప్రదర్శన జరిగింది. అయితే.. తాజా సమ్మిట్ లో మాత్రం ఇప్పటివరకు జరిగిన దానికి మించినరీతిలో భారీ ఎత్తున నిర్వహించటం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పేరు నమోదు చేసుకున్నట్లైంది. ఈ సమ్మిట్ 2025 ముగింపు వేడుకల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ వెలుగుల్లో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మరింత శోభను సంతరించుకుంటుందనిమాత్రం చెప్పక తప్పదు. ఏమైనా.. ఇటీవల కాలంలో భారీ ఎత్తున నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమ ప్రయత్నాలపై మాత్రం అభినందనలు పొందేలా సీఎం రేవంత్ ప్లానింగ్ ఫలించిందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News