మనుషుల కంటే పులులే ఎక్కువగా చూసిన పువ్వు.. మీరూ చూస్తారా?

ఈ క్రమమంలో... ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని బొటానిక్ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ క్రిస్ థోరోగుడ్ ఆ అరుదైన క్షణాన్ని చిత్రీకరించారు.;

Update: 2025-11-26 22:30 GMT

ఈ ప్రకృతిలో మనిషి చూసింది, తెలుసుకుంది గోరంత.. చూడాల్సింది, తెలుసుకోవాల్సింది కొండంత అని అంటారు. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత అరుదైన, తనలో దాచుకున్న అద్భుతాలను ప్రకృతి విడతల వారీగా మనిషికి చూపిస్తుంటుంది. ఈ క్రమలో తాజాగా సుమారు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఓ అరుదైన పుష్పాన్ని బయాలజిస్ట్ లు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ఇండోనేషియాలోని సుమత్రన్ వర్షారణ్యంలో ప్రపంచంలోని అత్యంత అరుదైన పుష్పాలలో ఒకదాన్ని కనుగొన్నారు. దాని శాస్త్రీయ నామం రాఫ్లేసియా హోసెల్టీ. ఈ సమయంలో దీన్ని గుర్తించిన అనంతరం ప్రముఖ బయాలజిస్ట్ సెప్టియన్ ఆండ్రీ (‘డెకీ’ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతారు) ఎమోషనల్ అయ్యి, అవిరామంగా ఏడుస్తూనే ఉన్నారని చెబుతున్నారు.

స్థానిక రేంజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ అరుదైన మొక్కను వెతుకుతూ దట్టమైన అడవిలో సుమారు ఒక రోజంతా నడిచిన పరిశోధకుల బృందంలో అతను ఒకడు. ఈ సందర్భంగా డెకీ స్పందిస్తూ... 13 ఏళ్ల తర్వాత సుమారు 23 గంటల ప్రయాణం, పులుల దాడుల ప్రమాదం, దాదాపుగా డెడ్ అయిపోయిన సెల్ ఫోన్ బ్యాటరీల నడుమ ఆ అరుదైన మొక్కను చూసినప్పుడు తాను మాట్లాడలేకపోయానని అన్నారు.

ఈ క్రమమంలో... ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని బొటానిక్ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ క్రిస్ థోరోగుడ్ ఆ అరుదైన క్షణాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వెంటనే అది వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ థోరోగూడ్... ఈ మొక్క ఒక దశాబ్ధానికి పైగా మానవ కళ్లకు అడవిలో కనిపించలేదని అన్నారు.

ఆ ప్లాంట్ ఉన్న ప్రదేశానికి చేరుకోవడం కేవలం కష్టంగానే కాకుండా.. అది పులులు, ఖడ్గమృగాలు నివసించే ప్రదేశంలో ఉందని డాక్టర్ థోరోగూడ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పువ్వును మనుషుల కంటే పులులే ఎక్కువ చూశాయని తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు.

కాగా... తన జీవితంలో ఎక్కువ భాగం అరుదైన పువ్వులను కనుగొనడం, వాటికి సంరక్షించడానికే అంకితం చేసిన డెకీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్ థోరోగుడ్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఈ జంట 2021లో సుమత్రన్ వర్ష్యారణ్యంలో పరిశోధన యాత్రలో ఉన్నప్పుడు అనేక రకాల రాప్లేసియాలను కనుగొన్నారు. అయితే, రాప్లేసియా హోసెల్టీ మాత్రం వారిని తప్పించుకుంది.. తాజాగా దొరికింది.

ఇక ఈ పువ్వులు 1 మీటరు వెడల్పు వరకూ పెరుగుతాయి.. 6 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయని చెబుతున్నారు.

Tags:    

Similar News