రామ్ గోపాల్ వ‌ర్మ నిక‌ర ఆస్తుల‌ విలువ‌?

రామ్ గోపాల్ వర్మ దేశంలో అత్యంత‌ ప్రజాదరణ పొందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ రైటర్ కం నిర్మాత‌గాను సుప్ర‌సిద్ధుడు.;

Update: 2025-08-03 17:53 GMT

అత‌డు మాట్లాడితే సంచ‌ల‌నం.. ఏం మాట్లాడినా వివాద‌మే..ఎదుటి వాడితో మైండ్ గేమ్ ఆడటంలో స్పెష‌లిస్ట్ .. గంద‌ర‌గోళ స‌మాధానాల‌తో క‌న్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుతాడు.. ప్ర‌తి రోజూ ప్ర‌తి క్ష‌ణం అతడు వివాదం కోస‌మే జీవిస్తాడు. 60 ప్ల‌స్ ఏజ్ లోను సిక్స్ టీన్ కుర్రాడిలా ఎంజాయ్ మెంట్ గురించి త‌ప్ప ఇంకేదీ మాట్లాడ‌డు. ఓడ్కా పుచ్చుకుని కూడా త‌డాఖా చూపిస్తాడు. గాళ్స్ థై సొగ‌సుల గురించి క‌విత‌లు అల్లుతాడు. వికారంగా వికృతంగా ప‌బ్బులు పార్టీల్లో తెగించేస్తాడు.

ఈ తెలుగు సినిమా ప్ర‌ముఖుడు ఎవ‌రో ఇప్పుడే కొత్త‌గా ప‌రిచ‌యం చేయాలా? క‌చ్ఛితంగా మీరు ఊహించిన‌ట్టే రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవీ. వివాదం కేరాఫ్ ఆర్జీవీ.. ఎప్పుడూ ఏదో ఒక ర‌గ‌డ‌తో నిరంత‌రం లైమ్ లైట్ లో ఎలా ఉండాలో అత‌డికి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో! అందుకే దర్శ‌కుడిగా కెరీర్ ముగిసి ద‌శాబ్ధం పూర్త‌యినా, అత‌డి గురించి ఇప్ప‌టికీ మీడియా క‌ల‌వ‌రించి, ఫ‌ల‌వ‌రిస్తూనే ఉంటుంది. అత‌డు ద‌గ్గినా తుమ్మినా వార్త‌లు అల్లేందుకు మీడియా ప్ర‌ముఖులు ఎగ‌బ‌డుతుంటారు. ఇది అత‌డి స్టాట‌స్‌కి సింబాలిజం.. ఫేమ్ లేక‌పోయినా అత‌డి మైండ్ గేమ్‌కి వ్యాక‌ర‌ణం.

జ్ఞానం ఉన్నా నిరుప‌యోగం:

రామ్ గోపాల్ వర్మ దేశంలో అత్యంత‌ ప్రజాదరణ పొందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ రైటర్ కం నిర్మాత‌గాను సుప్ర‌సిద్ధుడు. హిందీ, తెలుగు సినిమాల్లో ద‌శాబ్ధాల పాటు త‌న ప్ర‌భావం చూపిన మోస్ట్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్. బాలీవుడ్ కి వెళ్లి అక్క‌డి వాళ్లకే క‌థ‌లు, మేకింగ్ శైలిని నేర్పించిన ఘ‌నాపాటి. పెద్ద హీరోల‌తో ప‌రిమిత బ‌డ్జెట్ల‌లో సినిమాలు తీయడంలో ఆర్జీవీ స్పెష‌లిస్ట్‌. అయితే కొన్నేళ్లుగా అత‌డు త‌న సొంత శైలికి భిన్నంగా సినిమాలు తీస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. నేటి జెన్ జెడ్ కి ఏమాత్రం త‌గ్గ‌ని ఆలోచ‌న‌లు, అపార విజ్ఞానం ఉన్న ఆర్జీవీ ఇలా ఎందుకు చేస్తున్నాడో ఎవ‌రికీ పాల్పోదు.

ఆ ఒక్క‌టీ అడ‌క్కు:

ఆర్జీవీ జీవిత చ‌రిత్ర రాసే ఆస‌క్తి కానీ, బ‌యోపిక్ తీసే ఉత్సాహం కానీ ఎవ‌రికీ లేవు కానీ! అత‌డి గురించి ఏదైనా పాత విష‌యాన్ని కొత్త‌గా చెబితే వినేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగానే ఉన్నారు. తాజా ప‌రిశోధ‌న ప్ర‌కారం.. ద‌శాబ్ధాల పాటు ఇండియ‌న్ సినిమాలో ప్ర‌ముఖ వ్య‌క్తిగా కొన‌సాగుతున్న ఆర్జీవీ ఇన్నేళ్ల‌లో ఎంత సంపాదించి ఉంటాడు? ఎన్ని స్థిరాస్తుల‌ను కూడ‌గ‌ట్టాడు? అంటే.. తెలుగు ప్ర‌జ‌లు, ఆయ‌న అభిమానులు కూడా ట‌కీమ‌ని స‌మాధానం చెప్ప‌లేరు. ఎందుకంటే ఆర్జీవీ అన్నిటినీ ఓపెన్ గా చెబుతాడు కానీ త‌న ఆస్తులు, అంత‌స్తుల గురించి అస్స‌లు ఎప్పుడూ చెప్ప‌లేదు. చెప్ప‌డు కూడా..!

హైద‌రాబాద్ కా బాద్‌షా..

పెన్మెత్స‌ రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ నిక‌ర ఆస్తుల విలువ‌ను ప‌రిశీలిస్తే... అత‌డికి దాదాపుగా 41 కోట్ల నిక‌ర ఆస్తి ఉంటుంద‌ని అంచ‌నా. సివిల్ ఇంజనీరింగ్‌లో బి.ఇ. పూర్తి చేసి సివిల్ ఇంజనీర్‌గా ఆర్జీవీ కెరీర్‌ను ప్రారంభించాడు. సికింద్రాబాద్‌ సెయింట్ మేరీస్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, విజయవాడలోని వి.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగంలో ఇమ‌డ‌లేక `శివ` చిత్రంతో డైరెక్ట‌ర్ అయ్యాడు. 35 సంవత్సరాలుగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదితో వ‌ర్మ వయస్సు 63 సంవత్సరాలు.

సినీప్ర‌వేశం వెన‌క అస‌లు కార‌ణం:

రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకత్వంలోకి ప్రవేశించడం చాలా ఆసక్తికరం. ఒక వీడియో లైబ్రరీని చూసి తాను కూడా సినిమా దర్శకుడ‌వ్వాల‌ని అనుకున్నాడు. హైదరాబాద్‌- అమీర్‌పేటలో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. అటుపై నెమ్మదిగా సినిమా పరిశ్రమలో తన సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. బి. గోపాల్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు కానీ విజయం సాధించలేదు. 1989లో తన సొంత తెలుగు సినిమా `శివ`కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా క‌ల్ట్ జాన‌ర్ లో వ‌చ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.

ఏఏ మార్గాల్లో ఆర్జ‌న‌?

2024 నాటికి అత‌డి నికర ఆస్తుల‌ విలువ దాదాపు రూ. 41 కోట్లు (5 మిలియన్ డాల‌ర్లు). సినిమాల‌ నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వం, ప్రకటనలు, స్పాన్సర్ల ద్వారా ఆర్జీవీ మెజారిటీ ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టాడు. అత‌డికి హైద‌రాబాద్, విజ‌య‌వాడ స‌హా ప‌లు చోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని స‌న్నిహితులు చెబుతారు. అత‌డు ఫేం ఉన్నా లేక‌పోయినా, చాలా సులువుగా సంవత్సరానికి దాదాపు కోటి రూపాయ‌లు పైగా సంపాదిస్తాడని స‌మాచారం. ఆర్జీవీ స్క్రిప్ట్ రైటింగ్, టీవీ షోలను నిర్మించడం స‌హా న‌ట‌న‌తోను వంటి ఇత‌ర ప‌నుల‌తోను ఆర్జిస్తున్నాడు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబ‌డుల‌తో ను అత‌డు ఆర్జిస్తున్నాడు. అయితే ఆర్జీవీకి ఎన్ని కోట్లు ఉంటే ఎవ‌రికి కావాలి..? ఒక చెక్ బౌన్స్ కేసులో ఇటీవ‌ల ఆయ‌న పేరు రిపీటెడ్ గా వినిపించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది.

Tags:    

Similar News