ఆపరేషన్ సిందూర్‌కు 'కామా' మాత్రమే: రాజ్‌నాథ్ సింగ్
అయితే.. ఆయన తన ప్రసంగంలో సహజంగా తెలంగాణ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సినవి.. పోవాల్సినవి, ఇచ్చినవి, ఇస్తున్నవాటిని ప్రస్తావిస్తారని అందరూ అనుకుంటారు.;
తెలంగాణలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. సెప్టెంబరు 17వ తేదీని కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహిస్తే.. బీఆర్ ఎస్ నాయకులు సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తారు. కానీ, ఈ రెండింటికీ భిన్నంగా బీజేపీ మాత్రం `విమోచన` దినోత్సవంగా నిర్వహిస్తుంది. గతంలో నిజాం పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించిన దినో త్సవంగా ఈ రోజును బీజేపీ నాయకులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెరేడ్ మైదానం లో జరిగిన కార్యక్రమానికి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
అయితే.. ఆయన తన ప్రసంగంలో సహజంగా తెలంగాణ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సినవి.. పోవాల్సినవి, ఇచ్చినవి, ఇస్తున్నవాటిని ప్రస్తావిస్తారని అందరూ అనుకుంటారు. అంతేకాదు.. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటు యూరియా సమస్యను కూడా ప్రస్తావిస్తారని.. బీజేపీ నాయకులు మీడియా ముందు గుసగుసలాడారు. ''మా నాయ కుడు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు'' అని హైదరాబాద్కు చెందిన ఓ సీనియర్ నాయకుడు అన్నారు. కానీ, రాజ్‌నాథ్ తన ప్రసంగంలో మెజారిటీ భాగాన్నిమోడీ ప్రశంసలకు మాత్రమే పరిమితం చేశారు.
ఇదేసమయంలో యథాలాపంగా.. నాడు.. డిప్యూటీ ప్రధానిగా ఉన్న వల్లభ్‌భాయ్ పటేల్‌ను కూడా మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. ఆయనే లేకపోతే.. తెలంగాణకు పరిష్కారం లేదని చెప్పారు. వాస్తవానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న పటేల్.. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజాం పాలకులతో మాట్లాడి.. ఇక్కడి పాలనను పాకిస్థాన్ హస్తగతం చేసుకోకుండా.. భారత్‌లో విలీనం చేశారు. కానీ.. ఇది తమ ఘనతగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక, తన ప్రసంగంలో స్థానిక సమస్యలను కానీ, విభజన చట్టంలోని అంశాలను కానీ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం చేయాల్సిన పనులను కానీ.. రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడా ప్రస్తావించలేదు. నిజానికి విభజన చట్టం ప్రకారం.. రావాల్సి నవి ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించలేదు. అదేసమయంలో ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. దీనిపైనే 8 నిమిషాలకు పైగా మాట్లాడారు. ప్రధాని మోడీనికి ఆకాశానికి ఎత్తేశారు. దీనిపై మరో 10 నిమిషాలు ప్రసంగించారు. ఇక, తెలంగాణ నిజాం పాలన గురించి మరో 7 నిమిషాలు మాట్లాడారు. ఇలా.. తన ప్రసంగాన్ని ముగించేశారు.