షాకింగ్: అంబానీ కోడ‌లు ధ‌రించిన వాచ్ & బ్యాగ్ ఖ‌రీదు ఎంతో తెలుసా?

అంబానీ కోడలు రాధికా అంబానీ తన రాయల్ ఫ్యాషన్ సెన్స్- విలాసవంతమైన ఆభరణాల ఎంపికతో సోషల్ మీడియాలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు

Update: 2026-09-08 08:43 GMT

అంబానీ కోడలు రాధికా అంబానీ తన రాయల్ ఫ్యాషన్ సెన్స్- విలాసవంతమైన ఆభరణాల ఎంపికతో సోషల్ మీడియాలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పాపుల‌ర్ ఫ్యాషన్ ప్ర‌భావ‌శీలి పేజీ షేర్ చేసిన‌ వివరాల ప్రకారం.. రాధిక ఇటీవల ధరించిన అరుదైన డెకరేటివ్ డైమండ్ వాచ్, వరల్డ్ క్లాస్ హ్యాండ్ బ్యాగ్ కాంబినేషన్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాధికా అంబానీ చేతికి ధరించిన వాచ్ అత్యంత అరుదైన `పాటెక్ ఫిలిప్` బ్రాండ్‌కు చెందినది. `ట్వంటీ -4 ఫోలియేజ్ రిఫ‌రెన్స్ . 4909/107జీ మోడల్ అయిన ఈ వాచ్‌ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. దీనిపై అత్యంత ఖరీదైన బ్యాగెట్ వజ్రాలతో పాటు...అంద‌మైన ఎమరాల్డ్ (పచ్చల) లీఫ్ ప్యాటర్న్ డిజైన్‌ను అమర్చడం ఈ వాచ్ ప్రత్యేకత.

దీనికి తోడు రాధిక హ్యాండ్ బ్యాగ్ ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన యాక్సెసరీగా పాపుల‌రైంది. ప్రముఖ డిజైనర్ పియరీ హార్డీ రూపుదిద్దిన `హెర్మెస్ హాట్ బిజౌట్రీ సాక్ బిజౌ బిర్కిన్` బ్యాగ్‌ను ఆమె క్యారీ చేశారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందించిన ఈ రాయల్ బ్యాగ్‌పై ఏకంగా 3000 కంటే ఎక్కువ వజ్రాలను అమర్చడం విశేషం.

ఫ్యాషన్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. రాధికా అంబానీ ధరించిన ఈ వాచ్ - హ్యాండ్ బ్యాగ్ ల‌ మొత్తం విలువ మాత్రమే దాదాపు 4 మిలియన్ యూఎస్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 33 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. కేవ‌లం వాచ్ ధ‌ర కోటిన్న‌ర వ‌ర‌కూ ఉంటుంద‌ని, హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. ఈ లగ్జరీ యాక్సెసరీస్‌తో పాటు ప్రముఖ భారతీయ డిజైనర్లు అబూ జానీ - సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా డిజైన్ చేసిన `జెరీ జోరా` ఔట్‌ఫిట్‌లో రాధిక ధ‌గ‌ధ‌గా మెరిసిపోయారు.

అత్యంత విలాసవంతమైన డిజైనర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలతో రాధికా అంబానీ ఆవిష్కరించిన ఈ గ్రాండ్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్యాషన్ ప్రేమికులు - అభిమానులు అంబానీ కోడ‌లు ధరించిన రాయల్ కాంబినేషన్‌కు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News