ప్రశ్న మీది-గొంతు నాది: టీడీపీ ఎంపీ వినూత్న కార్యక్రమం
ఈ క్రమంలో 'ప్రశ్నమీది-గొంతు నాది' పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.;
టీడీపీ ఎంపీ ఒకరు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలను పార్లమెంటు వేదికగా వినిపించేందుకు.. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు.. ఆయన రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈ యువ ఎంపీ.. ఇప్పుడు నేరుగా ప్రజలతో మరింత భాగస్వామ్యం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 'ప్రశ్నమీది-గొంతు నాది' పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆయనే ఏలూరు పార్లమెంటు సభ్యుడు, యువ నాయకుడు, తొలిసారి పార్లమెంటుకు ఎన్నికలైన పుట్టా మహేష్ యాదవ్. నియోజకవర్గంలో అనతి కాలంలోనే ఆయన మంచి పేరు సంపాయించుకున్నారు వివాదాలకు దూరంగా ఉంటూ.. అందరినీ కలుపుకొని పోవడంలోనూ.. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకోవడంలోనూ ఆయన గుర్తింపు పొందారు. పార్లమెంటు సమావేశాల్లోనూ ఆయన తరచుగా నియోజకవర్గం సమస్యలను ప్రస్తావిస్తున్నారు.
అయితే.. మరిన్ని సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో ప్రజలకు మరింత చేరువ అయ్యే ఉద్దేశంతో పుట్టా మహేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రశ్న మీది-గొంతు నాది కార్యక్రమంలో భాగంగా ప్రజలు నేరుగా తమ ప్రాంత సమస్యను(వ్యక్తిగతం కాదు) వాట్సాప్‌కు పోస్టు చేయొచ్చు. దీనిని పరిష్కరించేందు కు తమకు ఉన్న ఆలోచనలను కూడా పంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ఏలూరు లో పెండింగులో ఉన్న సమస్యలను కూడా ఎంపీ దృష్టికి తీసుకురావచ్చు.
తద్వారా.. నియోజకవర్గం సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రశ్నించేందుకు. పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ప్రజలే ముందుకు వచ్చేందుకు ఎంపీ అవకాశం కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారి జరుగుతున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని.. ప్రజలు సహకరించాలని ఎంపీ మహేష్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ.. వాట్సాప్ నెంబర్లు:
96181 94377
98855 19299