పుతిన్ కు బాడీ డబుల్స్..నిజమెంత?

రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్ గురువారం రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకి చేరుకున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే విందులో పాల్గొంటారు.;

Update: 2025-12-05 08:24 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్ గురువారం రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకి చేరుకున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే విందులో పాల్గొంటారు. అలాగే డిసెంబర్ 5న జరిగే 23వ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే ఆయన పర్యటనకి వచ్చిన వేళ పుతిన్ పై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుండి ఆయన పర్యటన, ఆరోగ్యం చుట్టూ ఉన్న కొన్ని ఊహాగానాలు మళ్ళీ బయటికి వచ్చాయి.అదేంటంటే ఆయన బాడీ డబుల్స్ ఉపయోగిస్తున్నారని.. కొన్ని నివేదికల దృష్టికి వచ్చింది. ఆయనకి డూప్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆన్లైన్ కుట్ర సిద్ధాంతం సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. ఈ ధ్రువీకరించని వాదనలు ఆయన భద్రతా ప్రయోజనాల కోసం లేదా అనారోగ్యాన్ని దాచడానికి ఒకేలా కనిపించే వారని లేదా స్టాండ్ ఇన్ లపై ఆధారపడుతున్నారని సూచిస్తున్నాయి.అవసరమైనప్పుడు ఆయన డూప్స్ బయటికి వస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో ఉక్రెయిన్ సైనిక నిఘా అధిపతి మేజర్ జనరల్ కైరి లో బుడనోవ్ పుతిన్ తనని పోలి ఉండే ముగ్గురు బాడీ డబుల్స్ ను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని నియమిస్తున్నారని తెలిపారు. క్రెమ్లిన్ లో పుతిన్ నియంత్రణ కోల్పోయే అవకాశాన్ని దాచడానికి ఈ డబుల్స్ ని ఉపయోగించవచ్చని బుడనోవ్ తెలిపారు.

ప్రస్తుతం రష్యా దండయాత్ర వ్యూహంతో ఉక్రెయిన్ అయోమయంలో ఉందని,నిజమైన పుతిన్ ఇప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.. గతంలో ఆయన ఎంత చెడ్డవాడు అయినప్పటికీ అతను మూర్ఖుడు కాదు అని బుడనోవ్ తెలిపారు. రష్యా యుద్ధం ఎటువంటి తర్కాన్ని అనుసరించదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో డబుల్స్ కనిపించాయని,కానీ ఇప్పుడు అది రోజువారి చర్యగా పరిగణించబడుతుందని బుడనోవ్ ఆ సందర్భంలో చెప్పారు. పుతిన్ డూప్స్ లో ఎత్తు,హావభావాలు, శరీరం, భాష మరియు చెవులలో తేడాలు స్పష్టంగా కనిపించాయి అని తెలిపారు. అంతేకాదు ఈ సంవత్సరం ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కా సమ్మిట్ తర్వాత కూడా ఈ ఊహగానాలు వినిపించాయి.

కుట్ర సిద్ధాంతకర్తలు రష్యా అధ్యక్షుడు సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కాలేదని, ఆయనకు బదులు ఆయన బాడీ డబుల్ లో ఒక వ్యక్తిని అలస్కాకు పంపాడని పేర్కొన్నారు. ఈ వాదనలు రూపం మరియు నడకలో ఉన్న తేడా ఆధారంగా వినిపించాయి. విమానం నుండి దిగిన వ్యక్తికి పూర్తి చెంప ఎముకలు ఉన్నాయని, పుతిన్ కంటే ఎక్కువ ఉల్లాసంగా కనిపించారని కొందరు అనుమానించారు. అయితే ఇదే ప్రశ్న గతంలో రష్యన్ టెలివిజన్లో ప్రసారం చేయబడిన మారథాన్ ఫోన్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఓ విద్యార్థికి ఎదురైంది.కానీ పుతిన్ బాడీ డబుల్స్ గురించి జరిగే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అయితే క్రెమ్లిన్ ప్రకటనలో పుతిన్ బాడీ డబుల్స్ ని తిరస్కరించారు..

పుతిన్ తనలాంటి వారిని నియమించుకుంటున్నారనే ప్రచారాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి తరచూ తోసిపుచ్చారు. ఇది అసమర్థమైన సమాచార మోసాల వర్గానికి చెందినది. దీన్ని మీడియా మొత్తం ఆశించదగిన దృఢత్వంతో చర్చిస్తుంది. ఇది నవ్వుకోవడానికి తప్ప ఉపయోగమేమీ లేదు అంటూ కొట్టి పారేశారు. అయితే ఇలాంటి ప్రచారాన్ని పుతిన్ కూడా చాలా సందర్భాల్లో కొట్టి పారేశారు. తాను తనలాంటి వ్యక్తులను నియమించుకోలేదని తనకి డూప్స్ లేరని తెలిపారు. మరి ఇప్పటికైనా పుతిన్ బాడీ డబుల్స్ అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని సమాచారం.

Tags:    

Similar News