మొన్న బిరుదులు, నేడు ఇంట్లో స్థానం... సె*క్స్ కుంభకోణం దెబ్బతీసిన జీవితం!
అయితే ఆ ప్రకంపనలు పలు ప్రపంచ దేశాలకూ వ్యాపించిన పరిస్థితి! ఆ ప్రకంపనల ధాటికి బ్రిటన్ యువరాజు పరిస్థితి దారుణంగా దెబ్బతింది.;
ఎప్ స్టెన్ సెక్స్ కుంభకోణం అమెరికాను ఏ స్థాయిలో కుదిపేసిందనే సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకంపనలు పలు ప్రపంచ దేశాలకూ వ్యాపించిన పరిస్థితి! ఆ ప్రకంపనల ధాటికి బ్రిటన్ యువరాజు పరిస్థితి దారుణంగా దెబ్బతింది. ఈ క్రమంలో నిన్న బిరుదులు వదులుకున్న ఆయన.. తాజాగా ఇంటినుంచి బయటకు గెంటివేయబడ్డాడు. అతని జీవితాన్ని సెక్స్ కుంభకోణం ఆ రేంజ్ లో మార్చేసింది.
అవును... ఎప్ స్టెన్ సెక్స్ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికాకు చెందిన వర్జినియా గ్రిఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది. 17 ఏళ్ల వయసులో యువరాజు తనను మూడుసార్లు అనుభవించాడని ఆమె పేర్కొంది. ఆ ఆరోపణలు, తదనంతర పరిణామాల ప్రభావం ఇప్పుడు ప్రిన్స్ స్వయంగా అనుభవిస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఎప్ స్టెన్ సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా బయటకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తనకున్న రాయల్ టైటిల్ ను ఆయన ఇటీవల వదులుకున్నారు. అది తన అన్న బలవంతం మీదే అనే ప్రచారమూ జరిగింది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇందులో భాగంగా... బ్రిటన్ రాజు చార్లెస్ 3, తన సోదరిడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించడంతో పాటు ఆయన్ను బలవంతంగా ఇంటి నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బకింగ్ హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా బకింగ్ హామ్ ప్యాలెస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. కింగ్ చార్లెస్ 3.. ప్రిన్స్ ఆండ్రూ నుండి మిగిలిన అన్ని రాజ బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారని.. అతని విండ్సర్ నివాసాన్ని ఖాళీ చేయమని ఆదేశించారని తెలిపింది. ఫలితంగా... ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్ లోని సాండ్రిగ్ హోమ్ ప్రైవేటు ఎస్టేట్ లోకి మారతారని ఆ ప్రకటన వెల్లడించింది.
ప్రిన్స్ ఆండ్రూ ఇకపై 'డ్యూక్ ఆఫ్ యార్క్' బిరుదును కలిగి ఉండరని ఆ ప్రకటన మరింత ధృవీకరించింది. ఇదే క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు తిరస్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించిన అధికారిక ప్రకటన... అయినప్పటికీ ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు తెలిపింది.