ప్రశాంత్ కిశోర్ కింద అందరూ దొంగలేనా ?
మైండ్ గేమ్ తో ఓటర్లను ఆకట్టుకోవడం అన్నది గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో వచ్చిన కీలకమైన మార్పు. దానికి ఆద్యుడిగా పేరు చెప్పాలంటే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అని గట్టిగానే చెప్పక తప్పదు.;
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే దశాబ్దం క్రితం ఎన్నికల వ్యూహకర్తగా అవతారం ఎత్తారు దానికి రీజన్ సమాచార సాంకేతిక విప్లవం దేశంలో అప్పటికి పెద్ద ఎత్తున విస్తరించడం, అంతే కాదు సోషల్ మీడియా మానియా కూడా దేశంలో ఎక్కువగా ఉండడం, చాలా సులువుగా సమాచారం అంతా జనాలకు చేరువ చేసే సాధనాలు అధికం కావడంతో నయా రాజకీయం మొదలైంది. వ్యూహాల కోసం ప్రత్యేకంగా పార్టీలతో సంబంధం లేకుండా వ్యూహకర్తలు అవతరించారు. అంతే కాదు వీరంతా కూడా కార్పొరేట్ స్టైల్ లో న్యూ ట్రెండ్ పాలిటిక్స్ ని తీసుకుని వచ్చారు. మైండ్ గేమ్ తో ఓటర్లను ఆకట్టుకోవడం అన్నది గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో వచ్చిన కీలకమైన మార్పు. దానికి ఆద్యుడిగా పేరు చెప్పాలంటే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అని గట్టిగానే చెప్పక తప్పదు.
పీకే వ్యూహమేంటి :
పీకే తన వ్యూహాలతో ఎంతో మందిని సీఎంలుగా దేశంలో చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనా అలా జరిగిందా పీకే వల్లనే వారంతా కుర్చీలు ఎక్కారా అంటే అందులో కొంత వరకూ వాస్తవం ఉంది. అదే సమయంలో పీకే వ్యూహాలు ఓటర్ల మీదనే కాదు ఆయా రాజకీయ పార్టీల మీద అధినాయకుల మీద ప్రయోగించారు అన్నది కూడా అంతే నిజం. ఆయన గెలిచే పార్టీ వైపు ఉంటారు అన్నది కూడా అక్షర సత్యం. అంటే ఎవరికి అయితే జనంలో ఇమేజ్ ఉంటుందో వారి వద్దకే పీకే వెళ్తారు. ఇక కాగల కార్యాన్ని ఆ విధంగా నెరవేర్చి తాను ఆ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటారు అన్న విమర్శలు కూడా ఎన్నో ఉన్నాయి.
లెక్కలు అన్నీ సరి చూసి :
ఇక చూస్తే కనుక పీకే మార్క్ వ్యూహాలు ఎలా ఉంటాయి అంటే పీకేకి చెందిన ఐప్యాక్ అనే సంస్థ డేటా అనలైజ్ చేస్తారు. ఆ డేటా ప్రకారం ఎప్పడు ఏమి చేయాలో దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి. వారి ఓటు బ్యాంక్ ఎంత ఉంది. వారికి గత ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత ఇలా అనేక విషయాలను గమనంలోకి తీసుకుంటారు. అంతే కాదు ఆ పార్టీకి ఎవరు నెగిటివ్ గా ఉన్నారు, అలాగే ఎవరు పాజిటివ్ గా ఉన్నారు అనేది కూడా ఐప్యాక్ ద్వారా డేటా కలెక్షన్ చేసుకుంటారు. అలా ఒక రాజకీయ పార్టీతో పీకే టీం ఒప్పందం కుదుర్చుకుంటుంది. అలాగే సీఎం గా ఉన్న వారు కానీ సీఎం అవాలని అనుకుంటున్న వారు కానీ వాళ్ళ రూట్ ని చేంజ్ చేస్తూ పీకే అక్కడ తన స్ట్రాటజీని ఫుల్ గా వాడుతారు అన్న మాట.
పీకే సూపర్ సక్సెస్ :
అయితే డేటా ఎనలిస్ట్ గా కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ విషయంలో కానీ పీకే పక్కాగా ముందుకు సాగుతారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా అధినాయకులకు నిజాలు చెబుతూ వచ్చేవారు. ఒక మార్పు ఆయా పార్టీలు చేసుకోవాలంటే గట్టిగా చెప్పి ఒప్పించేవారు. ఇదంతా పీకే మార్క్ స్ట్రాటజీ గా ఉంటూ సక్సెస్ అయ్యేది. పీకే కుండ బద్ధలు కొడతారు, నిజాలు చెప్పి మాత్రమే అధినేతలకు సలహాలు ఇస్తారు ముందే చెప్పుకున్నట్లుగా ఆయన గెలుపు గుర్రాలను ఎంచుకోవడం కాదు వారు మధ్యలో రేసులో వెనుక పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పీకే బ్యాచ్ తోనే అనేక చిక్కులు వస్తున్నాయి.
బ్రాండ్ నేమ్ వాడేసుకుంటూ :
పీకే టీం లో ఎంతో మంది ఉంటూ వచ్చారు. వారంతా పీకే అండర్ లో పనిచేస్తూ ఆయన సూచనలు సలహాలతోనే ముందుకు సాగేవారు. ఎపుడైతే పీకే తన ఎన్నికల వ్యూహకర్త అవతారం చాలించారో అపుడు ఆయన టీం లోని వారు బయటకు వచ్చి తామూ పీకే అంతటి వారమని ఫోజులు కొడుతూ బడా పార్టీలని పట్టేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు. పీకే కనుక ఒప్పందం చేసుకుంటే అన్నీ నిజాలు చెప్పే వారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక టీం లో వాళ్ళంతా బాస్ లు అయిపోయారు. అంతే కాదు వారు తప్పుడు నివేదికలు ఇస్తూ బడా రాజకీయ పార్టీలనే బోల్తా కొట్టిస్తున్నారు అని విమర్శలు విన వస్తున్నాయి.
వైసీపీని ముంచేశారు :
ఇక 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో కూడా పీకే టీం నుంచి వచ్చిన వారితో ఒప్పందం చేసుకుని వారి సేవలను వాడుకుంది. అలా రిషి రాజ్ సింగ్ అన్న ఆయన వైసీపీలో కీలకంగా మారారు. అయితే వీరు పీకే మాదిరిగా పక్కాగా వాస్తవాలు చెప్పకుండా వైసీపీని నిండా ముంచేశారు అని అంటున్నారు. జగన్ కి జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంటే దానిని చెప్పకుండా రిషి టీం తప్పు దోవ పట్టించింది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ క్యాడర్ లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నా కూడా దానిని సైతం దాచి పెట్టారు అని గుర్తు చేస్తున్నారు.
అంతా బాగుంది అంటూ :
వైసీపీకి వ్యతిరేకత 2022 సగం నుంచి మొదలైంది. అది 2023కి బాగా పెరిగింది. అయినా సరిచేసుకునే చాన్స్ ఉంది. కానీ రిషి టీం మాత్రం అసలు విషయం చెప్పకుండా అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు అన్నీ పాజిటివ్ గానే ఇవ్వడమే కాదు వై నాట్ 175 అని కూడా చెప్పడంతోనే వైసీపీ అధినాయకత్వం అతి ధీమాకు పోయింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కనీ వినీ ఎరగని తీరున వైసీపీ పతనం అయింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయి ఈ రోజూ రోడ్డు మీదకు వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే పీకే శిష్యులుగా చెప్పుకుంటూ పనిచేసిన టీం జగన్ ని మోసం చేసింది అని వైసీపీలోనే చర్చ సాగుతోంది.
పక్కన పెడితేనే :
ఇక మీదట కూడా రిషి రాజ్ సిగ్ టీం ని నమ్మితే మాత్రం వైసీపీని అసలు ఎవరూ కాపాడలేరని అంటున్నారు. కోట్ల రూపాయలు తీసుకుంటూ వైసీపీని నిండా ముంచిన రిషి రాజ్ టీం ని దగ్గరకు తీయకూడదని అంటున్నారు. వైసీపీ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిందని, అయినా 40 శాతం ఓటు షేర్ ఉందని, ఇపుడు అన్నీ సర్దుకుని తప్పులు దిద్దుకొని ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం ఎవరూ వైసీపీని కాపాడలేరని అంటున్నారు. ముందు రిషి టీం ని పక్కన పెడితేనే వైసీపీకి భవిష్యత్తు అని కూడా అంటున్నారు.