• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వంశీపై 16 క్రిమినల్ ...

వంశీపై 16 క్రిమినల్ కేసులు.. రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు!

| గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.

By - Tupaki Desk
Update: 2025-02-14 04:45 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో.. ప్రభుత్వం తరుపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 గంటల వరకూ ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.

ఈ క్రమంలో సుదీర్ఘ వాదనలు విన్న న్యాయముర్తి రామ్మోహన్.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వల్లభనేని వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామ కృష్ణ ప్రసాద్ లకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సమయంలో వంశీ రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇందులో భాగంగా... గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్ధన్ ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ సమయంలో మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్థన్ చేశాడని గుర్తించినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... వంశీకి నేర చరిత్ర ఉందని.. అతనిపై ఇప్పటివరకూ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు!

కాగా... గురువారం ఉదయం వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది! ఈ సమయంలో వంశీతో పాటు అతడి అనుచరులైన శివరామకృష్ణ, లక్ష్మీపతి లపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    
  • Vallabhanenivamsi 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Police 
  • Remandreport 
  • Criminalcases 
  • Vallabhanenivamsiarrest 
  • Tdp 
  • Janasena 
  • Satyavardan 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS