• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దేశం మొత్తానికి...

దేశం మొత్తానికి చెబుతున్నా.. లోకేష్ ను చూసి నేర్చుకోండి

| విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించిందని చెబుతున్నారు. దాదాపు 3 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డ్సులోకి ఎక్కడంపై ప్రధాని మోడీ కూడా అభినందించారు.

By - Tupaki Desk
Update: 2025-06-21 10:38 GMT

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించిందని చెబుతున్నారు. దాదాపు 3 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డ్సులోకి ఎక్కడంపై ప్రధాని మోడీ కూడా అభినందించారు. యోగాంధ్ర విజయవంతం కావడానికి యువనేత, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ చేసిన కృషిని అభినందిస్తున్నట్లు చెప్పారు. సభా వేదికపై నుంచి లోకేష్ ను అభినందించిన ప్రధాని మోదీ, యువనేతను చూసి దేశంలో మిగిలిన వారంతా కష్టపడటం నేర్చుకోవాలని సూచించారు.

యోగాంధ్ర విజయవంతం కావడం వెనుక రాష్ట్ర మంత్రి లోకేశ్ తీవ్రంగా కష్టపడ్డారని ప్రధాని మోదీ ప్రశంసించారు. దాదాపు నెల రోజులుగా ఆయన చేసి కృషి ఫలితమే విశాఖలో యోగాంధ్ర సక్సెస్ అయిందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి లోకేశ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని మోడీ కొనియాడారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి లోకేశ్ పనిచేశారని ప్రధాని చెప్పారు. లోకేశ్ పనిచేసిన విధానాన్ని దేశంలో ప్రతి ఒక్కరూ నమూనాగా చేసుకుని పాటించాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ప్రశంసలతో మంత్రి నారా లోకేశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పెట్టుబడుల సాధనలో తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్ తన పనితీరుతో జాతీయ నేతలను ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. ఒక్క యోగాంధ్రే కాకుండా, ఐటీ పాలసీలు, రాష్ట్ర సమస్యలపై పలుమార్లు ఢిల్లీ వెళుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్న లోకేశ్ తన సమర్థతను చాటుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో ప్రధాని మోదీతో సుమారు రెండు గంటల పాటు చర్చించారు లోకేశ్. నాటి విశేషాలను ఒక్క రోజు ముందుగా వెల్లడించిన లోకేశ్.. విశాఖలో ప్రధానితో అభినందనలు అందుకోవడం విశేషంగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రి #ChandrababuNaidu గారు, ఉపముఖ్యమంత్రి #PawanKalyan గారు , మంత్రి #NaraLokesh గారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా - PM #NarendraModi.#Yogandhra2025 #Yogandhra #InternationalYogaDay2025 #AndhraPradesh #Tupaki pic.twitter.com/4rWB3ivRsb

— Tupaki (@tupaki_official) June 21, 2025
Tags:    
  • YogAndhraSuccess 
  • YogaAndhra 
  • NarendraModi 
  • NaraLokesh 
  • PMAppreciatesLokesh 
  • Visakhapatnam 
  • Yoga 
  • GuinnessRecord 
  • APGovernment 
  • YouthLeadership 
  • NationalRecognition 
  • PoliticalNews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS