ప్రధాని మోడీ స్టైల్ బాలయ్య డైలాగుతో.. లోకేష్ స్పీచ్ వైరల్!

అవును... 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో కర్నూలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-16 10:27 GMT

ప్రధాని మోడీ ఏపీలో కర్నూలులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సుమారు 450 ఎకరాల మైదానంలో 'సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌' పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మైకందుకున్న మంత్రి లోకేష్... ప్రధాని నరేంద్ర మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో కర్నూలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.

నమో అంటే విక్టరీ!:

ఈ సందర్భంగా... నరేంద్ర మోడీ (నమో) అంటే విక్టరీ.. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని మొదలుపెట్టిన మంత్రి నారా లోకేష్.. ఆయన భారత్ ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని అన్నారు. గుజరాత్‌ ముఖ్యమత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ... తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో ఇప్పుడూ అలాగే కష్టపడుతున్నారని లోకేష్ కొనియాడారు.

ఇదే క్రమంలో... కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్‌.. ఇది డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదు.. డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ అని చెప్పిన లోకేష్... నమో సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, విశాఖ రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా... నమో అంటే దేశ ప్రజల నమ్మకం.. దేశ ప్రజలకు నమో అంటే నమ్మకం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’!:

ఇదేసమయంలో గతంలో భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేస్తే.. గత ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితి దగ్గరకో, మరో దేశం దగ్గరకో వెళ్లేవని.. అయితే, ప్రధాని మోడీ హయాంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు దిమ్మతిరిగే దెబ్బకొట్టారని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుపడుతుంటే, అందుకు పెద్ద పెద్ద దేశాలే వణికిపోయాయని లోకేష్ అన్నారు. కానీ... ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు అనేది మన నమో స్టైల్ అని లోకేష్ వెల్లడించారు. ఆయన గుండె ధైర్యం ఆత్మ నిర్భర్ భారత్ అని లోకేష్ కొనియాడారు!

Tags:    

Similar News