పైలెట్ అత్యుత్సాహం..విమానయాన సంస్థ దెబ్బ.. ఏం జరిగిందంటే?
ఒక పైలెట్ విమాన ప్రయాణ సమయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విమానం కాక్ పిట్ డోర్ తెరిచే ఉంచారు.;
సాధారణంగా భూమి పై నడిచే వాహనాలు నడిపే వారిని డ్రైవర్ అని పిలుస్తూ ఉంటారు.. ట్రైన్ నడిపే వారిని లోకో పైలట్ అంటారు.. అదే విమానాన్ని నడిపితే పైలట్ అంటారు.. అలాంటి పైలెట్ ఎంత అలర్ట్ గా విమానాన్ని నడిపితే.. ప్రయాణికులు అంత క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఒక విమానం కదిలింది అంటే వందలాది మంది ప్రయాణికులు అందులో ఉంటారు. వాళ్లు గాల్లో గంటలకు పైగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే తప్పనిసరిగా విమానయాన సంస్థలు పెట్టే రిస్ట్రిక్షన్స్ ప్రకారమే పైలెట్ నడుచుకోవాలి. అలా అయితేనే విమానయాన సంస్థ సేఫ్ గా ఉంటుంది. ప్రయాణికులు కూడా సేఫ్ గా గమ్యస్థానానికి చేరుకుంటారు. కానీ పైలట్ ఏమాత్రం మిస్టేక్ చేసినా విమానాలు పూర్తిగా గాలిలోనే స్మాష్ అయిపోతాయి.. ప్రయాణికులంతా మరణిస్తారు... అలాంటిది ఒక పైలెట్ చేసిన మిస్టేక్ వల్ల పెను ప్రమాదమే తప్పింది. అంతే కాదు ఈ విషయాన్ని విమానయాన అధికారులు గమనించి , ఆ పైలెట్ పై సస్పెన్షన్ వేటు వేశారు.. ఇంతకీ ఏం ఇప్పుడు జరిగిందో చూద్దాం..
ఒక పైలెట్ విమాన ప్రయాణ సమయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విమానం కాక్ పిట్ డోర్ తెరిచే ఉంచారు. దీనిపై ఆందోళన చెందినటువంటి ప్రయాణికులు చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత అక్కడి అధికారులకు ఈ విషయం తెలియజేయడంతో వారు దర్యాప్తు చేసి, ఆ పైలెట్ పై సస్పెన్షన్ వేటు వేశారు. నిజానికి ఆ డోర్ తెరిచేది ఉగ్రవాదులు ఎవరైనా విమానాన్ని హైజాక్ చేస్తే, లేదంటే ఏదైనా ప్రమాద సమయంలో మాత్రమే ప్రయాణికులతో మాట్లాడడానికి తెరుస్తారు. కానీ ఆ పైలెట్ మాత్రం ముందుగానే ఆ డోర్ తెరిచి చిక్కుల్లో పడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందినటువంటి ఒక విమానం లండన్ హీత్రు నుంచి న్యూయార్క్ కు బయలుదేరింది. అయితే ఇదే విమానంలో ఆ పైలెట్ కుటుంబ సభ్యులు కూడా ఎక్కారు. దీంతో ఆ పైలెట్ వారి కుటుంబం తాను విమానాన్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తాడో చూడాలని కోరిందట. దీంతో ఆ పైలెట్ కాక్ పిట్ డోర్ కాసేపు తెరిచి ఉంచారు. ఇదంతా గమనించినటువంటి ప్రయాణికులు ఇతర సిబ్బంది తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు విమానం యూఎస్ లో ల్యాండ్ అయిన వెంటనే ఈ విషయాన్ని విమానయాన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు అదంతా నిజమేనని తేలడంతో అతనిపై తీవ్రంగా చర్యలు తీసుకున్నారు.
అంతేకాదు న్యూయార్క్ నుంచి తిరిగి లండన్ రావల్సినటు వంటి విమానాన్ని రద్దు చేసేసారు. ఆ ప్రయాణికులకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.. అయితే దీనిపై సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. నిజానికి ఈ కాక్ పిట్ డోర్ అనేది ఎప్పుడు మూసివేసే ఉండాలి. ముఖ్యంగా ఏదైనా విమానం హైజాక్ లేదా ఉగ్రముప్పు బారిన పడినప్పుడు మాత్రమే ఈ డోర్లను తెరుస్తూ ఉంటారు. కానీ ఇది ఏది లేకుండానే పైలట్ ఈ డోర్ తెరవడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.