డెవ‌ల‌ప్‌మెంట్ విష‌యంలో ఆ ఎమ్మెల్యే రూటే వేరు...!

ప‌నులు చేసుకునే ఎమ్మెల్యేలకు చేతినిండా ప‌ని ఉంటోంది. ప‌నులు చేయ‌ని ఎమ్మెల్యేల‌కు మాత్రం ఏవేవో సంక‌టాలు క‌నిపిస్తూనే ఉన్నాయి.;

Update: 2025-08-04 21:30 GMT

ప‌నులు చేసుకునే ఎమ్మెల్యేలకు చేతినిండా ప‌ని ఉంటోంది. ప‌నులు చేయ‌ని ఎమ్మెల్యేల‌కు మాత్రం ఏవేవో సంక‌టాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ప‌నులు చేయ‌లేక పోతున్నామ‌ని చెబుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా ఓ 10 మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు ప‌నులు చేసుకుంటున్నారు. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి బాట ప‌ట్టిస్తున్నారు. ఇలాంటి వారిలో పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే గుంటూరు జిల్లాలో నెంబ‌ర్ 2గా ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎన్టీఆర్ ట్ర‌స్టును అనుసంధానం చేసుకుని ఆయ‌న గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. పేద విద్యార్థులను బ‌డిబాట ప‌ట్టిస్తున్నారు. అదేవిధంగా త‌న సొంత నిధుల‌ను కూడా ఖ‌ర్చు చేసి.. వాట‌ర్ ట్యాంకులు.. స‌హా.. పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తున్నారు. ఇక‌, ఉప ముఖ్య‌మంత్రి చూస్తున్న పంచాయ‌తీరాజ్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని.. ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ప‌నులు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. వాటిని నిరంత‌రం ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఈ ప‌థ‌కం కింద కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌ను వినియోగిస్తున్నారు. అయితే.. వీటిని వినియోగించుకు నే విష‌యంలోనూ కూట‌మి నాయ‌కులు కొంత వెనుక బ‌డ్డారు. కానీ, పెద కూరపాడు నుంచి తొలిసారి విజయం ద‌క్కించుకున్న భాష్యం ప్ర‌వీణ్ మాత్రం.. ప‌నిలో ముందుంటున్నారు. ఇదే స‌మ‌యంలో కూట‌మి నాయ‌కుల‌తోనూ ఆయ‌న క‌లివిడిగా ఉంటున్నారు. ఇటీవ‌ల పీ4 కార్య‌క్ర‌మం కింద‌.. త‌న‌కు తెలిసిన ఎన్నారై మిత్రుల‌ను తీసుకువ‌చ్చి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు.

వారిని ద‌త్త‌త తీసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని వారిని కోరారు. అంతేకాదు.. వారి సాయంతో పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన‌.. స‌రుకులు కూడా పంపిణీ చేశారు. సుమారు 100 కుటుంబాల‌ను ఎన్నారైలు ద‌త్త‌త తీసుకునేలా ప్ర‌య‌త్నించి.. చంద్ర‌బాబు నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నారు. అదేస‌మ యంలో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌కు అవ‌కాశం లేకుండా.. అంద‌రికీ అందుబాటులో ఉంటున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాల‌న్న ఉద్దేశంతో ప్ర‌వీణ్‌.. క‌లివిడి త‌నం కూడా క‌లిసి వ‌స్తోంది. దీంతో అటు డెవ‌ల‌ప్‌మెంటు.. ఇటు పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకునే కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి.

Tags:    

Similar News