పవన్ సీరియస్.. నేనేమైనా సీఎంనా?

ఓట్లు కోసమో హడావుడి చేయడానికో తాను ఇక్కడికి రాలేదని చెప్పారు. కోనసీమ రైతాంగం గళం అవుతానని హామీ ఇచ్చారు.;

Update: 2025-11-26 12:26 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. సముద్ర పోటుతో శంకరగుప్తం డ్రైన్‌ ఉప్పు మయంగా మారిపోవడం, కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వస్తుండటాన్ని పవన్ గమనించారు. కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో పవన్ పర్యటన సాగింది. రైతుల సమస్యలను తెలుసుకున్న పవన్ పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మరచిపోయారని, ఓట్లు కోసమో హడావుడి చేయడానికో తాను ఇక్కడికి రాలేదని చెప్పారు. కోనసీమ రైతాంగం గళం అవుతానని హామీ ఇచ్చారు. రైతులకు వరాలు ఇవ్వడానికి తాను సీఎం కాదని, ఆయన దృష్టికి సమస్యలు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. డిసెంబరు రెండో వారంలో మళ్లీ వస్తానని కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు.

ఇక రైతుల సమస్యలను తెలుసుకుంటున్న క్రమంలో కొందరు అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. రైతులకు అండగా నిలవాలని సూచించారు. అంబేద్కర్ జిల్లాలో పర్యటించిన పవన్ రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి భరోసా ఇచ్చేలా స్పష్టమైన హామీలిచ్చారు. శంకరగుప్తం డ్రైనుతో తాగునీటి జలాలు ఉప్పుమయంగా మారాయని రైతులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. డ్రైన్ ఆధునికీకరణకు రూ.4 కోట్లు అవసరమని పవన్ తెలిపారు. జిల్లాలని రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టిలో పెడతానని పవన్ తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో రైతులు ఆధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. డిసెంబరు రెండో వారంలో రైతన్నలతో మరోసారి సమావేశమవుతానని పవన్ ధైర్యం చెప్పారు. ఇక సర్వీసు రూల్స్ లేకుండా సచివాలయం ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం పనిచేసిందని ఆక్షేపించారు. ప్రజలను మభ్య పెట్టడానికి తాను రాలేదని చెప్పారు. కాగా, సీఎంలా తన దగ్గర డబ్బులు లేవని, రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు పవన్ చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక సమస్యకు ప్రధాన కారణంగా శంకరగుప్తం డ్రైన్ పై పవన్ భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని నిలదీశారు. డిసెంబరు రెండో వారంలో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని అధికారులకు పవన్ ఆదేశించారు.




Tags:    

Similar News