ఫైరింగ్ రేంజిలో తుపాకీ పట్టిన పవన్ కల్యాణ్.. వీడియో వేరే లెవెల్!

ఇలా ఇంతకాలం ఆయన తుపాకీ పట్టుకుని షూట్ చేయడం సినిమాల్లో చూసిన వారికి తాజాగా రియల్ గా తుపాకీ చేతపట్టి కనిపించారు పవన్ కల్యాణ్.;

Update: 2025-11-09 15:26 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు తుపాకులు, ఆయుధాలంటే చాలా ఇష్టం అనేది తెలిసిన విషయమే! ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తుపాకీ పట్టడం కనిపిస్తుంటుంది.. అది వెండి తెరపై ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఇలా ఇంతకాలం ఆయన తుపాకీ పట్టుకుని షూట్ చేయడం సినిమాల్లో చూసిన వారికి తాజాగా రియల్ గా తుపాకీ చేతపట్టి కనిపించారు పవన్ కల్యాణ్.

అవును... తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ, ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ సంచలనం అనే సంగతి తెలిసిందే! ఇక ఆయనకున్న హాబీల్లో పుస్తకాలు చదవడం ఒకటంటే.. ఆయనకున్న ఇష్టాల్లో తుపాకులు పట్టుకోవడం, ఫైరింగ్ రేంజ్ లో ప్రాక్టీస్ చేయడం ఒకటని అంటారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ తాడేపల్లిలోని ఏపీ ఫైరింగ్ రేంజ్ కు వెళ్లి తుపాకీ చేతపట్టారు.

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. ఇందులో భాగంగా... ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం.. తుపాకీ చేతపట్టారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా... తన వ్యక్తిగత గ్లాక్ 0.45 పిస్టల్‌ తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో "వేరే లెవెల్" అనే కామెంట్లను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా... ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకున్నారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తుచేసుకున్నారు.

ఇందులో భాగంగా... ఈ అనుభవం తనకు ఒకరకమైన ధ్యానంలా అనిపించిందని.. చెన్నైలో ఉన్నప్పుడు మద్రాస్ రైఫిల్ క్లబ్ లో తాను సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తుకు వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. కాల్పుల విధానాలు, తుపాకీ నిర్వహణను అర్థం చేసుకోవడానికి అధికారులతో సంభాషించినట్లు వెల్లడించారు.



Tags:    

Similar News