• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సైకిల్‌పై పది కిలోమీటర్ల...

సైకిల్‌పై పది కిలోమీటర్ల ప్రయాణం.. మండుటెండలో మంత్రి నిమ్మల సాహసం!

| ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల శుక్రవారం తన కారును పక్కన పెట్టేశారు.

By - Tupaki Political Desk
Update: 2026-05-15 12:56 GMT

ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తీరు విలక్షణంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా తనదైన మార్కు కచ్చితంగా వేస్తారు. అధికార దర్పానికి కాస్త దూరంగా ఉండే మంత్రి నిమ్మల.. సోషల్ మీడియాను ఆకర్షించే పనులకు మాత్రం చాలా దగ్గరగా ఉంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు. ఏపీ కేబినెట్ మంత్రుల్లో అందరికంటే భిన్నంగా నడుచుకుంటూ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న మంత్రి నిమ్మల తాజాగా మరో సాహసం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులు కూడా మా మంత్రి కష్టం చూడండి అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు.

చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి బడా నేతలు తమ కాన్వాయ్ ల్లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించుకుంటున్నారు. ప్రధాని కేవలం రెండు కార్లలోనే తిరుగుతుండగా, సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ వాహనాలను కూడా పరిమితం చేశారు. ఇక క్యాబినెట్ మంత్రులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పరిగణించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల శుక్రవారం తన కారును పక్కన పెట్టేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ కి సమీపంలో ఉన్న తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి దాదాపు పది కిలోమీటర్ల దూరం సైకిల్ పై వెళ్లారు. మండుటెండలో మంత్రి నిమ్మల ఒక్కరే చకచక సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం స్థానికులను అబ్బురపరిచింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలే విజయవాడలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటి వాతావరణంలో ట్రాఫిక్ ను దాడుకుంటూ మంత్రి సైకిల్ పై ముందుకు సాగిపోవడం వైరల్ అవుతోంది.

ఇక మంత్రి నిమ్మల మాదిరిగా చంద్రబాబు క్యాబినెట్ లో కీలక బాధ్యతలు చూస్తున్న ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా నో వెహికల్ డే పాటించారు. కాకపోతే ఆయన తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలో తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి సైకిల్ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలను పాటిస్తానని ప్రకటించారు. ఇలా ఏపీకి చెందిన ఇద్దరు మంత్రుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మెరుస్తుండటంపై ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలోని పలువురు ప్రజాప్రతినిధులు హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పొలిటీషియన్స్ అంతా ప్రచారం కోసం ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారా? లేక నిజంగా నా దేశం నా బాధ్యత అన్న సిద్ధాంతానికి కట్టుబడే ఇలా చేస్తున్నారా? అన్నది విస్తృత చర్చగా ఉంది.

అమరావతి.జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.నో వెహికల్ డే సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడుమండుటెండలో దాదాపు 10 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి pic.twitter.com/vYX9xjzTJl

— I & PR Andhra Pradesh (@IPR_AP) May 15, 2026
Tags:    
  • nimmalaramanaidu 
  • andhrapradesh 
  • novehicleday 
  • chandrababu 
  • viralvideo 

Similar News

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

2026-11-14 11:30 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!

2026-11-14 10:43 GMT

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

2026-11-14 10:30 GMT

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

2026-11-14 09:30 GMT

పాకిస్థాన్‌లో ఉద్యోగాల కోసం దేశం విడుస్తున్న ప్రజలు.. అధికారుల విదేశీ ఆస్తులపై ఆరోపణలు!

2026-11-14 08:52 GMT

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

2026-11-14 08:30 GMT

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

2026-11-14 07:49 GMT

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

2026-11-14 07:19 GMT

ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

2026-11-14 06:54 GMT

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌దే.. భారత్ స్థానం ఎంతంటే?

2026-11-14 05:23 GMT

Nvidia నెక్ట్స్ సీఈవో రెనే హాసేనా? ఆర్మ్ బాస్ పేరు తెరపైకి.. ఇంకా ఉత్కంఠే!

2026-11-14 05:04 GMT

Copyright @2026

Powered by Blink CMS