ఫుల్లు బిజీలోనూ లోకేష్ ప్ర‌జాసేవ‌!

విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.;

Update: 2025-11-15 11:39 GMT

విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.ఈ స‌ద‌స్సుకు 72 దేశాల నుంచిప్ర‌తినిధులు హాజ‌రైనట్టు సీఎం స్వ‌యంగా ప్ర‌క‌టించా రు. సో.. అతిథుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు, మ‌రోవైపు పెట్టుబ‌డుల ఒప్పందాలు.. సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు ఇలా.. సీఎం, మంత్రి నారా లోకేష్ కూడా బిజీగా ఉన్నారు. అయినా.. ఇంత బిజీలోనూ నారా లోకేష్ ప్ర‌జ‌ల‌ను , ప్ర‌జా సేవ‌ను మ‌రిచిపోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు త‌యార‌వుతూనే ప్ర‌జ‌ల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. విశాఖ‌లోని టీడీపీ కార్యాల‌యానికి ఉద‌యం 8 గంట‌ల‌కే చేరుకున్న లోకేష్‌.. 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు స‌మ‌యం కేటాయించారు. వారితో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అర్జీలు తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

+ నకిలీ పత్రాలతో కొంతమంది వ్యక్తులు తమ 5.64 ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చిననడిపిల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

+ జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం కల్పించి తమకు అండగా నిలవాలని ‘నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జండర్ పర్సన్స్’ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు.

+ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కొప్పాల సుధాకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

+ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెంలోని తమ 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖకు చెందిన ఎన్.నరసింహస్వామి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News