లోకేష్... అవి తగ్గించి...ఇవి పెంచేసి !
చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని జనాలు చెబుతారు. ప్రత్యర్ధులు సైతం ఈ విషయం అంగీకరిస్తారు.
మంత్రి నారా లోకేష్ రాజకీయంగా రాటుదేలారు అన్నది అంతా అంటున్న విషయమే. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న కీలక నేతగా, పలు ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలు చూస్తున్న మంత్రిగా లోకేష్ చాలా స్పష్టతతో ఉన్నారు. రాజకీయ నేతగా మంత్రిగా ఎపుడు ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో ఆ తేడాను చక్కగా చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా విషయాలలో ఆయన రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధ్యానత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఏపీకి మేలు చేసే లీడర్ గా :
చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని జనాలు చెబుతారు. ప్రత్యర్ధులు సైతం ఈ విషయం అంగీకరిస్తారు. అంతే కాదు పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసే విషయంలో బాబు ముందుంటారని ఆయన వినూత్న ఆలోచనలు ఎపుడూ చేస్తారని కూడా అంతా అంటారు. ఇక టీడీపీకి నవతరం వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో ఆయన అతి ముఖ్యుడిగా ఎమర్జ్ అవుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ సైతం తనదైన బ్రాండ్ ఇమేజ్ ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి మేలు చేసే లీడర్ గా ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే ఒక అంబాసిడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయన నిరంతరం తపన పడుతున్నారు.
విదేశీ పర్యటనల ద్వారా :
లోకేష్ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన దక్షిణ కొరియా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. అక్కడ ఎల్జీ, శాంసంగ్, హ్యుందాయ్ మోబిస్ వంటి దిగ్గజ సంస్థలతో లోకేష్ వరస భేటీలు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ, విశాఖలో యూనిట్లు, ఈవీ సెమీకండక్టర్ హబ్ ఏర్పాటుకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీని ఏఐ- కంప్యూట్ హబ్‍గా మార్చాలని శాంసంగ్‌కు కీలకమైన ప్రతిపాదనను లోకేష్ చేశారు. ఇక ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన వివరిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఏపీని అగ్రగామిగా నిలపుతామని చెప్పారు.
సోషల్ మీడియ ఫిర్యాదు మీద :
ఈ క్రమంలో ఇంత బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదు మీద ట్వీట్ ద్వారా తక్షణం స్పందించారు. రాజమహేంద్రవరంలో ఇసుక లారీల వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయని టీడీపీ మహిళా కార్యకర్త చేసిన ట్వీట్‌పై స్పందించిన లోకేష్ వెంటనే రోడ్డు నిర్మించాలని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయడం విశేషం. అన్నింటి కంటే ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రహదారులు దెబ్బతినడం అన్నది గత రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యగా ఉందని లోకేష్ దృష్టికి వెళ్ళడంతో పరిష్కారం వచ్చింది అని అంతా అంటున్నారు.
ఆ వేదికల మీదనే :
ఇక లోకేష్ రాజకీయ విమర్శలను కేవలం పార్టీ సమావేశాలు ఇతర సందర్భాలలోనే చేస్తూ వస్తున్నారు. చాలా విషయాల మీద ఆయన ఆచీ తూచీ రియాక్ట్ అవుతున్నారు. తద్వారా తన ఫోకస్ ఏంటి అన్నది చెప్పగలుగుతున్నారు. ఏపీలో డెవలప్మెంట్ అవసరం అని పెట్టుబడులు తేవాల్సి ఉందని తరచూ లొకేష్ చెబుతున్నారు. దానికి అనుగుణంగా ఆయన విదేశీ పర్యటనలు ఉంటున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంక్లేవ్ లకు హాజరు కావడం ఇంటర్వ్యూలు ఇవ్వడం కీలక సదస్సులలో పాలు పంచుకోవడం ద్వారా లోకేష్ తనకంటూ స్పెషల్ బ్రాండ్ ని ఏర్పాటు చేసుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మాటకు మాట అంటూ ఏపీలో సాగుతున్న రాజకీయ వేడికి దూరంగా ఉంటూనే సమయానుకూలంగా ఆయన రియాక్ట్ అవుతున్నారని ఆయన వైఖరిని గమనిస్తున్న వారికి అర్ధం అవుతున్న విషయం అని విశ్లేషిస్తున్నారు.