ప‌త్తాలేని 'శంక‌ర్‌'.. వైసీపీ కేడ‌ర్ ఉసూరు..!

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేరు. రెండు సార్లు పార్టీ కార్యాలయానికి వ‌చ్చిన ఆయ‌న త‌ర్వాత నుంచి మానేశారు.;

Update: 2026-03-21 22:30 GMT

``నేను ఇస్మార్ట్ శంక‌ర్‌. ఎక్కడైనా నామాటే నెగ్గాలి`` అంటూ.. గ‌త వైసీపీ హ‌యాంలో గుంటూరులోని పెద కూర‌పాడు స‌హా.. రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పిన నంబూరు శంక‌ర్రావు.. ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు? అంటే.. ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేరు. రెండు సార్లు పార్టీ కార్యాలయానికి వ‌చ్చిన ఆయ‌న త‌ర్వాత నుంచి మానేశారు.

ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కూడా త‌న వారిని పెద‌కూరపాడులో పెట్టిన శంక‌ర్రావు.. తాను మాత్రం గుంటూరు, హైద‌రాబాద్ చుట్టూ తిరిగేవారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరొందిన ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం పాల‌య్యారు. వాస్త‌వానికి నియోజ‌క‌వ‌ర్గం మార్చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. కానీ.. పెద‌కూర‌పాడు ను `గెలిచి గిఫ్ట్‌`గా ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన శంక‌ర్రావు.. ఓడిపోయిన త‌ర్వాత మొహం చెల్ల‌లేద‌ని అంటున్నా రు.

ఇదిలావుంటే.. కేడ‌ర్ ప‌రిస్థితి ఇప్పుడు అగమ్య గోచ‌రంగా ఉంది. ఎవ‌రూ పెద్ద‌గా ఉలుకు పలుకు లేకుండా నే ఉన్నారు. ప్ర‌స్తుతం శంక‌ర్రావు హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేశార‌ని తెలుస్తోంది. గతంలో మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కుడు.. కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌ను వేధించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపై ఆయ‌న కేసులు పెట్టారు. దీంతో ఆ కేసులు ఎక్క‌డ వెంటాడుతాయోన‌న్న బెంగ కూడా.. శంక‌ర్రావులో ఉంద‌ని అంటున్నారు. అందుకే మౌనంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.

అయితే.. దీనిపై మ‌రో విశ్లేష‌ణ కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కేడ‌ర్ జోలికి వెళ్తే.. జేబులు ఖాళీ అవుతాయని.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి ట్రై చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఏదే మైనా.. ప్ర‌స్తుతం శంక‌ర్ గురించి నియోజ‌క‌వ‌ర్గంలో మాట్లాడేవారు.. ఆయ‌న గురించి చ‌ర్చించే వారు లేరు. పోనీ.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చినా.. వెంట‌నే కేసుల ఉచ్చు బిగుసుకుంటుంద‌ని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. పెద‌కూర‌పాడులో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ లేకుండా పోయింది.

Tags:    

Similar News