• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  60 రోజులు నిద్రపోతే...

60 రోజులు నిద్రపోతే చాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.9.6 లక్షలు!

| ముంబైకి చెందిన జినియా ఛటర్జీకి నిద్రపోతూ రూ.9.6 లక్షలు గెలుచుకునే అవకాశం వచ్చింది. వేక్‌ఫిట్ సంస్థ నిర్వహించిన 60 రోజుల స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీలో ఆమె విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 10 మందికి మాత్రమే అవకాశం లభించింది. నిద్ర సమయం, నాణ్యతతో పాటు పలు టాస్కుల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. నగదు బహుమతితో పాటు ఉచిత విదేశీ పర్యటన కూడా ఆమెకు దక్కింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-07 05:54 GMT

సాధారణంగా ఉద్యోగం చేయాలంటే రోజూ ఎన్నో గంటలు కష్టపడాలి. కొంతమంది అయితే ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కానీ నిద్రపోతూ లక్షల రూపాయలు సంపాదించడం గురించి ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ముంబైకి చెందిన ఓ మహిళ కేవలం 60 రోజుల పాటు జరిగిన ఒక పోటీలో పాల్గొని.. ఏకంగా రూ.9.6 లక్షలు గెలుచుకుంది. అంతేకాదు ఆమెకు ఉచితంగా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లభించింది.

ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే మహిళ ఈ అరుదైన పోటీలో విజేతగా నిలిచింది. వేక్‌ఫిట్ అనే హోమ్ ఫర్నిషింగ్ సంస్థ ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీని నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా.. దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ దశల్లో సెలెక్ట్ అయినా.. 10 మందికి మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు.

ఈ పోటీ దాదాపు రెండు నెలల పాటు కొనసాగింది. ఇందులో పాల్గొన్నవారు ప్రతిరోజూ కరెక్ట్ టైం కి నిద్రపోవాలి. వారి నిద్ర సమయాన్ని, నిద్ర నాణ్యతను పరిశీలిస్తూ రోజువారీ స్కోర్లు ఇచ్చేవారు. ఈ స్కోర్ల ఆధారంగా లీడర్‌బోర్డ్‌లో వారి స్థానాలను నిర్ణయించేవారు.

ఈ పోటీలో కేవలం నిద్రపోతే సరిపోదు. ప్రతి వారం కొన్ని.. ఆసక్తికరమైన టాస్కులు కూడా ఇచ్చేవారు. ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్రకు సంబంధించిన అంశాలతో మళ్లీ చేయడం ఒక టాస్క్. అలాగే ఒక వారం పాటు తమ నిద్ర అలవాట్లను పరిశీలించి వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది.

రెండు నెలల తర్వాత జినియా ఛటర్జీతో పాటు మరికొందరు ఫైనల్‌కు చేరుకున్నారు. చివరి దశలో జ్ఞాపకశక్తి, పరిశీలన సామర్థ్యం పరీక్షించే టాస్కులు నిర్వహించారు. చివరకు నిద్ర స్కోర్ల ఆధారంగా జినియా విజేతగా నిలిచింది.

ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు వేక్‌ఫిట్ సంస్థ తరఫున ఉచిత విహారయాత్ర బహుమతిగా లభించింది.

Tags:    
  • wakefit 
  • sleepinternship 
  • ziniachatterjee 
  • sleepchallenge 
  • mumbainews 

Similar News

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS