#ViralPic - మోదీని దించాలంటే ‘క్షుద్ర పూజలే దిక్కా’? యూపీలో అది కూడా చేసేశారు..
అది ఉత్తరప్రదేశ్ లోని సరయూ నదీ తీరం.. సాధారణంగా అక్కడ కర్మఖండలు జరుగుతుంటాయి.
అది ఉత్తరప్రదేశ్ లోని సరయూ నదీ తీరం.. సాధారణంగా అక్కడ కర్మఖండలు జరుగుతుంటాయి. కానీ ఈసారి మోడీపై కడుపు మండిన కొందరికీ అక్కడ క్షుద్రపూజలు గుర్తుకువచ్చాయి.. వెంటనే మోడీ ఫొటో తెచ్చి ముగ్గేసి అందులో మోడీ ఫొటో కొబ్బరికాయలు పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి క్షుద్రపూజలు చేసేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కాదు సుమా.. దేశంలోనే వైరల్ అయ్యింది. ఏకంగా ప్రధానిపైనే క్షుద్రపూజలు చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.చేసింది ఎవరు? ఎందుకుచేశారు? అన్నది తెలుసుకునే పని లో పోలీసులు చాలాబిజీగా ఉన్నారు.
దేశంలోనే కాదబ్బా.. ఇప్పుడు ప్రపంచంలోనే నరేంద్రమోదీ ఓ పే...ద్ద తోపు లీడర్. అగ్రరాజ్యం అమెరికానే మోడీని ఏం చేయలేక.. డీల్స్ కు ఒప్పించలేక ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. ప్రపంచంలోనే మన మోడీ అంత టఫ్ నెగోషియేటర్ లేడు అంటూ స్వయంగా ట్రంప్ నోటి నుంచే ఆ ఆణిముత్యాలు జాలువారాయి. అలాంటి మోడీని ఎలాగైనా గద్దెదించాలని.. అమెరికా, యూరప్ సహా పాశ్చాత్య దేశాలు కాచుకూర్చున్నాయి..
దేశంలోని చెలరేగిన కాక్రోజ్ జనతా పార్టీకి విదేశీశక్తులు అత్యంత ప్రాధాన్యతనిచ్చేది అందుకే.. సీజేపీని ముందుపెట్టి మోడీని అభాసుపాలు చేసి గద్దె దించే ప్రయత్నాలను దేశంలోని ప్రతిపక్షాలే కాదు.. విదేశాల్లోని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా.. నిజానిజాలేంటో తెలియదు కానీ.. మోడీ లాంటి శక్తివంతమైన నేతను భారత్ లో అధికారంలోకి దించేందుకు అమెరికా, చైనా, పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు.
కానీ మన మోడీ ట్రాక్ రికార్డ్ మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అట్లుంది మరీ.. మోడీ గుజరాత్ సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి ఒక్క ఎన్నిక కూడా ఓడిపోలేదు. గుజరాత్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి దేశాన్ని ఆకర్షించి 2014లో దేశ ప్రధాని అభ్యర్థిగా నిలిచి ఇప్పటికీ గెలుగు గుర్రాలను వరుస ఎన్నికల్లో ఎక్కుతూ అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తున్నారు. అసలు మోడీని గద్దె దించడం దేశంలోని ప్రతిపక్షాలకు అర్థంకాక ఏం చేయాలో పాలుపోవడం లేదు.
బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోనూ అదే కథ. అందుకే కొరకరాని కొయ్య లాంటి మోడీని ఎలా దించాలి? అని ఆలోచించిన కొందరు కేటుగాళ్లు కావచ్చు..రాజకీయ నేతలో మరెవరో తెలియదు కానీ కొత్తపద్ధతులను అవలంభించారు.
యూపీలోని మౌజిల్లాలో సరయూ నది ఒడ్డున ప్రధాని మోదీ ఫొటోచుట్టూ కొబ్బరికాయలు, నిమ్మకాయలు ,మేకులు కనిపించడంతో ఆయనపై క్షుద్రపూజలు జరిగినట్టు వైరల్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది . బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోనే ఇది జరగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
కాగా దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఊరుకుంటుందా సెటైర్ వేసేసింది. యూపీ పోలీసులు నేరాలను ఆపకుండా క్షుద్ర పూజల ఘటనలకు ప్రాధాన్యం ఇస్తోందంటూ ఓ వీడియోను ట్వీట్ చేసేసింది. ఈ పరిణామం ఇప్పుడు మరింతగా చర్చనీయాంశమైంది.
ఎవరినైనా గద్దె దించాలంటే ఎన్నికల్లో ఓడించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మోడీని ఓడించడం ఎవరి వల్ల కాదు.. అందుకే ఇలా క్షుద్రపూజలతో నరుక్కొస్తున్నారు కావచ్చు మంత్రగాళ్లు.. మరి ఇది వర్కవుట్ అవుతుందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే అదంతా అభూతకల్పనే. మరి చూడాలి ఏం జరుగుతుందో.. ఇలాంటి మూఢ నమ్మకాలతో ఒకదేశప్రధానిని ఏంచేయలేరన్న వాస్తవాన్ని అందరూ గుర్తిస్తే మంచిది.