సబ్ స్క్రైబర్స్ లో ఒక్క శాతం ఓట్లు వచ్చుంటే.. ఎమ్మెల్యే అయిపోయేవారు!
ప్రముఖ యూట్యూబర్,, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి త్రిపురారి కుమార్ తివారి అలియాస్ మనీష్ కశ్యప్.. పశ్చిమ చంపారన్ లోని చాన్ పాటియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.;
సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ఉన్న ఓ ఎమ్మెల్యే అభ్యర్థి.. వాటిలో ఒక్క శాతం కూడా ఓట్లు రాక ఓటమి పాలవ్వడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీల తర్వాత మూడోస్థానానికి పరిమితమైన ఘటన తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ బీజేపీ నేత, ప్రస్తుత జన సురాజ్ పార్టీ అభ్యర్థి అయిన మనీష్ కశ్యప్ నెట్టింట చర్చనీయాంశంగా మారారు.
అవును... ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో సుమారు 9.6 మిలియన్స్ (దాదాపు 96 లక్షాలు) మంది సబ్ స్క్రైబర్స్ లతో బాగా పాపులర్ అయిన యూట్యూబర్.. బీహార్ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన విషయం ఇప్పుడు నెట్టింట ఆసక్తిగా మారింది. చాన్ పాటియా నియోజకవర్గంలో తొలుత ట్రయాంగిల్ ఫైట్ గా భావించిన ఈ పోటీలో ఆయన మూడోస్థానంలో నిలిచారు.
ప్రముఖ యూట్యూబర్,, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి త్రిపురారి కుమార్ తివారి అలియాస్ మనీష్ కశ్యప్.. పశ్చిమ చంపారన్ లోని చాన్ పాటియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ 87,538 ఓట్లు సాధించి 602 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా.. తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ 86,936 ఓట్లు సాధించారు.
ఈ క్రమంలో... మనీష్ కశ్యప్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ 37,172 ఓట్లు సాధించారు. తన దైన పెర్ఫార్మెన్స్ చేశారు! ఈ నేపథ్యంలోనే తన ఛానల్ కున్న సబ్ స్క్రైబర్స్ లో ఒక్క శాతం ఓట్లు వచ్చినా 90వేలకు పైగా ఓట్లతో టాప్ లో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
బీజేపీ టూ జేఎస్పీ!:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. జూలై మొదటివారంలో మనీష్ కశ్యప్ ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఒక నెల క్రితమే బీజేపీని విడిచిపెట్టిన ఆయన... పాట్నాలోని బాపు భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఎస్పీలో చేరారు. ఆయన రాకను పీకే సాగరంగా స్వాగతించారు.. ఎమ్మెల్యే టిక్కెట్ కూడా కేటాయించారు.
నాడు ఆ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ కిశోర్... మనీష్ కశ్యప్, జన్ సూరజ్ కు కేవలం యూట్యూబర్ కాదని.. బీజేపీ మాజీ నాయకుడు కూడా కాదని.. తన సొంత బలం, కృషి, జ్ఞానం ద్వారా తన గుర్తింపును ఏర్పరచుకున్న బీహార్ కుమారుడని.. రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటున్నాడని అన్నారు.