‘పోలీసులు తీసుకున్న రూ.900ల్లో రూ.750 తిరిగి ఇప్పించండి’

ఒక సంచలన కేసులో నిందితుడిగా ఆరోపణలతో అరెస్టు అయి.. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషిగా విడుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన వేళ.. వారంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తారని భావిస్తాం.;

Update: 2025-08-01 04:36 GMT

ఒక సంచలన కేసులో నిందితుడిగా ఆరోపణలతో అరెస్టు అయి.. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషిగా విడుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన వేళ.. వారంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తారని భావిస్తాం. అయితే.. ఇందుకు భిన్నమైన సీన్ అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇంతకూ ఇదేం కేసు? దీని తీవ్రత ఎంత? తీర్పు వేళ కోర్టులో చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

దాదాపు పదిహేడేళ్ల క్రితం (2008లో) దేశ వ్యాప్తంగా సంచనలంగా మారిన మాలేగావ్ పేలుళ్ల ఉదంతం గురించి తెలిసిందే. ఒకవేళ దానికి సంబంధించిన వివరాలు మర్చిపోయి ఉంటే క్లుప్తంగా ప్రస్తావిస్తాం. అప్పుడు రీకాప్ చేసుకోవటం ఈజీ అవుతుంది. మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు జరిగింది. మసీదుకు సమీపంలో ఏర్పాటు మైటార్ సైకిల్ ఉంచి.. అందులో అమర్చిన బాంబ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవటమే కాదు.. వంద మందికి పైనే గాయపడ్డారు. అప్పట్లో పెను సంచనలంగా మారిన ఈ ఉదంతంలో ప్రజ్ఞాఠాకూర్, పురోహిత్ తో పాటు రమేశ్ ఉపాధ్యాయ.. అజయ్ రహీర్ కార్.. సుధాకర్ ద్వివేది.. సుధాకర్ చతుర్వేది.. సమీర్ కులకర్ణిలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ఈ కేసు బాధ్యతను ఎన్ఐఎన్ టేకప్ చేసింది. ఈ కేసులో 220 మంది సాక్ష్యుల్ని విచారించగా అందులో 15 మంది తొలుత తాము ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఇదిలా ఉంటే..తాజాగా ఇచ్చిన కీలక తీర్పులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్.. లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తో సహా మొత్తం ఏడుగురు నిందితులు నిర్దోషులుగా పేర్కొంటూ ఎన్ఐఎ కోర్టు తేల్చింది.

ఈ కేసు తీర్పు వేళ అనూహ్య ఘటన జరిగింది. న్యాయస్థానం నిర్దోషిగా తేల్చిన వారిలో సమీర్ కులకర్ణి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన షాకింగ్ ఆరోపణ ఏమంటే.. తనను అరెస్టు చేసే వేళలో తన వద్ద ఉన్న రూ.900 అప్పట్లో పోలీసులు తీసుకున్నారని.. కానీ రికార్డుల్లో మాత్రం రూ.750 మాత్రమే చూపినట్లుగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్నట్లుగా రూ.150వదిలేసి రూ.750 తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని జడ్జిని కోరారు.

దీనికి స్పందించిన న్యాయమూర్తి తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇక్కడ సమీర్ కులకర్ణికి కావాల్సింది తన నుంచి పోలీసులు తీసుకున్న చిన్నపాటి మొత్తం కాదు. కానీ.. పోలీసుల తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని రికార్డుల్లో చూపించాలన్నదే లక్ష్యమన్న మాట వినిపిస్తోంది. అతుల్ కులకర్ణి కోరినట్లుగా రూ.750 వెంటనే రాదని.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కేసుకు సంబంధించిన వస్తువులు.. నగదు తిరిగి ఇవ్వటం కుదరదని పేర్కొంది. అయితే.. న్యాయంగా పోలీసుల నుంచి అతుల్ కులకర్ణికి రావాల్సిన మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. తీర్పు నేపథ్యంలో కోర్టు హాల్లో మూడు సెకన్ల పాటు భారత్ మాతా కీ జై అనే నినాదాలు చేసేందుకు అనుమతించాలని కోరగా.. అందుకు కోర్టు నో చెప్పసింది. ఇలా నినాదాలు చేయటం కోర్టు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. మొత్తంగా సంచలనంగా మారిన మాలేగావ్ పేలుళ్ల కేసు ఒక కొలిక్కి రావటమే కాదు.. తీర్పు వెలువడే వేళ చోటు చేసుకున్న ఈ రెండు ఆసక్తికర ఉదంతాలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News