చైన్ స్నాచర్లను వెంటాడిన కారు.. చివరికి ఏమైందంటే?

కానీ నేరగాళ్లు మరింత దూకుడుగా పరిగెత్తారు. ట్రాఫిక్ మధ్యలో లోపల బయట స్లిప్ అవుతూ, చిన్న చిన్న గ్యాప్‌లలోనుంచి దూసుకొని వెళ్లడం వారి ప్రాణాలకు కూడా ప్రమాదం;

Update: 2025-12-01 06:59 GMT

పట్టణ జీవితంలో మనం ఎంత సురక్షితమని అనుకున్నా, ఒక క్షణం చాలు రద్దీ రోడ్డు మధ్యలోనే నేరం మన కళ్లముందే జరగొచ్చు. లక్నోలో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అలాంటి ఝలక్ ఇచ్చిందే. సీసీటీవీ వీడియోలో కనిపించిన దృశ్యాలు, మన నగరాల అసహాయతను ఎంత స్పష్టంగా మన ముందుంచుతున్నాయో చూడాలి. బిజీ రోడ్డుపై నడుస్తున్న ఒక మహిళకు, ఒక్కసారిగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు చైన్‌ను లాగేసి (చైన్ స్నాచింగ్) దూసుకుపోయారు. ఇలాంటి దాడులు జరిగేటప్పుడు ప్రతిస్పందించడానికి ప్రజలకు ఎంత తక్కువ సమయం దొరుకుతుందో ఈ వీడియో పూర్తిగా చెబుతుంది. నేరస్తులు మాత్రం క్షణాల్లో అదృశ్యమవుతారు.

కారులో ఉన్న వారి స్పందనపై ప్రశంసలు..

కానీ ఆ క్షణంలో జరిగినది అభినందనీయమే. దగ్గరలో ఉన్న వాహనదారులు ఘటనను కళ్లారా చూసి, ఒక్కసారిగా అప్రమత్తమై రోడ్డుపై నుంచి వారు బయటకు వెళ్లకుండా దుండగులను వెంటాడడం మొదలుపెట్టారు. సెకన్ల వ్యవధిలోనే కార్లు ఇంజిన్ స్టార్ట్ చేసి, బైక్‌ వెంట పడటమే ఇది అక్కడి ప్రజల్లో ఇంకా జవాబుదారీతనం మిగిలే ఉందని చెప్పడానికి నిదర్శనం.

చేజ్ కొనసాగిన కొద్దిసేపటికే, కారు డ్రైవర్లు లేన్‌లను మార్చుతూ, బైక్‌ను బ్లాక్ ను బ్లాక్ చేసి ఆపేందుకు ప్రయత్నిస్తూ దూసుకుపోయారు. వారి స్పీడ్ చూస్తుంటే ఇదేదో సినిమా చేజింగ్ సన్నివేశంలా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా రోడ్డుపై జరిగిందే. నిజ జీవితంలో ధైర్యం ఎలా పనిచేస్తుందో చెప్పే దృశ్యం. ఏ క్షణానైనా దొరికే అవకాశం కోసం వారు ఎదురు చూశారు.

దూకుడుగా వ్యవహరించిన చైన్ స్నాచర్లు..

కానీ నేరగాళ్లు మరింత దూకుడుగా పరిగెత్తారు. ట్రాఫిక్ మధ్యలో లోపల బయట స్లిప్ అవుతూ, చిన్న చిన్న గ్యాప్‌లలోనుంచి దూసుకొని వెళ్లడం వారి ప్రాణాలకు కూడా ప్రమాదం, కానీ తప్పించుకోవడమే లక్ష్యంగా దుండగులు వ్యవహరించిన తీరు కనిపించింది. ఈ దృశ్యాలు నగర రహదారుల్లో నడిచే అసహజ వేగం, నిర్లక్ష్య రైడింగ్‌ను కూడా మనకు గుర్తు చేస్తాయి. కొన్ని నిమిషాల్లోనే బైక్ దొంగలు ట్రాఫిక్‌లో కలసిపోయి అదృశ్యమయ్యారు. కార్ల వేగం ఎంత ఉన్నా, నగర రద్దీ వారిని వెంటాడేందుకు ప్రయత్నించి విఫలమైందనే చెప్పాలి. ధైర్యంగా వెంటపడినవారి ప్రయత్నం విఫలమైన క్షణం నమ్మశక్యం కాని దృశ్యం.

మహిళ అయితే ప్రాణాపాయం లేకుండా బయటపడింది. కానీ ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది ఆ భయానక క్షణం. ఇలాంటి నేరాలు ఎంతకాలం మన సమాజాన్ని వెంటాడుతాయో అనే ప్రశ్న మాత్రమే మిగిల్చాయి. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు చైన్ స్నాచర్లను వెంటాడిన డ్రైవర్ల ధైర్యాన్ని ప్రశంసించడం సహజమే. కనీసం నేరస్తులు భయపడే వాతావరణాన్ని ప్రజలే చాలా సార్లు సృష్టిస్తున్నారు.

చైన్ స్నాచింగ్ లాంటి ఘటనలు నగరాల్లో రోజువారీగానే జరుగుతున్నాయి. మెరుగైన సీసీటీవీ కవరేజ్, పోలీసుల వేగవంతమైన స్పందన కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు కూడా వేగంగా స్పందిస్తేనే నగలు తమకు చేరుతాయని అంటున్నారు. ఎందుకంటే నేరాలు వేగంగా జరుగుతున్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ స్పీడ్ తగ్గుతున్నట్లు అనిపిస్తుందని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News