లోకేష్ లో మంచి తండ్రి...దేవాన్ష్ కి ఇచ్చినదేంటంటే !

అదే సమయంలో ఆయన తీసుకుని రావాలనుకుంటున్న సంస్కరణలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.;

Update: 2025-07-10 16:30 GMT

ఏపీ రాజకీయాల్లో యువ నేతగా లోకేష్ ఉన్నారు. ఆయన తండ్రి బాటలో నడుస్తూనే తనకంటూ ప్రత్యేకతను దక్కించుకుంటున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఏపీలో లోకేష్ ముందుకు సాగుతున్నారు. పరిపాలన మీద కానీ తనకు అప్పగించిన శాఖ పట్ల కానీ ఆయన చూపిస్తున్న శ్రద్ధ నిబద్ధత గొప్పగా ఉంటున్నాయి. అదే సమయంలో ఆయన తీసుకుని రావాలనుకుంటున్న సంస్కరణలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇలా తన బ్రాండ్ అన్నది చూపించాలని లోకేష్ రాజకీయంగా తపన పడుతున్నారు. ఇక తండ్రిగా ఆయన కుటుంబ సంబంధాల పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది కూడా ఒక ఆసక్తి కరమైన విషయంగా ఉంది. ఒక జాతీయ చానల్ కి లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యార్ధుల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి వివరిస్తూ తన కుటుంబం గురించి కూడా చెప్పుకొచ్చారు.

తన కుమారుడు దేవాన్ష్ ని జాగ్రత్తగా తాను తన సతీమణి బ్రాహ్మణి పెంచుతున్నామని చెప్పారు. దేవాన్ష్ కి ఎక్కువగా భారతీయ జీవన విధానం దేవీ దేవతల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ రోజులలో చూస్తే ప్రపంచం అంతా సూపర్ మాన్ అని ఐరన్ మ్యాన్ అని ఉర్రూతలూగుతున్న నేపథ్యం ఉంది.

ఈ క్రమంలో దేవన్ష్ కూడా ఆ వైపు మోజు పడటం అన్నది అనివార్యంగా ఉంటుంది. కానీ తాము మాత్రం అతనికి మనకు ఉన్న సూపర్ హీరోలు అయిన హనుమంతుడు గురించి తెలియచేస్తామని లోకేష్ చెప్పడం విశేషం. అంతే కాదు రాముడుతో పాటు హిందూ దేవుళ్ల పట్ల అతనిలో అనురక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

హిందూత్వంలోని గొప్పతనం గురించి తెలియచేప్పడమే కాదు సాంస్కృతిక విషయంగా చూసుకున్నా చిన్ననాటి నుంచే చెప్పాల్సింది తల్లిదండ్రులుగా చెప్పాలన్నది తన ఉద్దేశ్యంగా లోకేష్ చెప్పారు. ఆ విషయంలో తాము ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని లోకేష్ చెప్పడం ఇపుడు వైరల్ గా మారుతోంది.

మరో వైపు చూస్తే ఏపీలో విద్యా సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని లోకేష్ చెప్పారు. అంతే కాదు విద్యా రంగంలోనే ఏపీ దేశంలోనే నంబర్ వన్ గా ఉండాలని తాము కోరుకుంటామని ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఉంచాలన్నదే తమ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి సూపర్ మాన్ కాదు ఐరన్ మాన్ కాదు హనుమాన్ మన హీరో అని లోకేష్ దేవాన్ష్ ద్వారా ఈనాటి తరానికి ఇస్తున్న సందేశం నిజంగా మెచ్చతగినది అని అంటున్నారు. అలా విద్యా మంత్రిగా ఎంతో మంది పిల్లాలకు బాధ్యుడిగానే కాకుండా తన కుమారుడికి కూడా బాధ్యత కలిగిన తండ్రిగా లోకేష్ మంచి మార్కులే వేయించుకుంటున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News