ఇది... వంచన బడ్జెట్: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా నాలుగోసారి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రధాన ప్రతిప క్షం బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు.;
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా నాలుగోసారి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రధాన ప్రతిప క్షం బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం గన్ పార్క్ వద్దకు వెళ్లి.. తెలం గాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం.. అక్కడి నుంచి కాలి నడకన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రెండు చోట్లా కూడా.. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది నయవంచన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.
గత 2023లో జరిగిన ఎన్నికల్లోప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి అధికారం దక్కించుకున్నారని.. జేమ్స్ బాండ్ లెక్క.. కాంగ్రెస్ నాయకులు.. ప్రజలు అనేక బాండ్లు కూడా రాసిచ్చారని.. అయితే.. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఆరు గ్యారెంటీల సంగతేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈ విషయంపై ఒక్కరు కూడా నోరు మెదపడం లేదన్నారు. బడ్జెట్‌లో చెబుతున్న అంకెలకు.. ఖర్చులకు ఎక్కడా పొంతన ఉండడం లేదని విమర్శించారు.
''అంకెల గారడీ తప్ప.. మరొకటి లేదు.'' అని కేటీఆర్ విమర్శించారు. ప్రతి విషయాన్నీ తాము ప్రశ్నిస్తు న్నామనే.. అసెంబ్లీలో మైకు కూడా ఇవ్వడం లేదన్నారు. సరైన సమాధానం చెప్పకుండా.. తాము అడుగు తున్న ప్రశ్నలపై వ్యాఖ్యానాలు చేస్తున్నారని.. సెటైర్లు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నో ఆశలు పెట్టు కుని ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పాలకులు పక్కా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
స్కూళ్లలో అవినీతి: హరీష్
మోడల్ స్కూళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ధనాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. రిటైర్డ్ అధికారులను అడ్డు పెట్టుకుని.. ఒక్కొక్క స్కూలుకు కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. ప్లానింగ్ నుంచి కాంట్రాక్టుల వరకు కూడా దోచుకున్నారని.. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అవినీతిలో అందరూ భాగస్వాములేనని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ నోరు నొక్కలేరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.