కొలికపూడి ఎపిసోడ్ : కూటమి సీరియస్ మీటింగ్
ఇక చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాస్ చాలా కాలంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారని సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.;
ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయాలు ఎపుడూ హాట్ హాట్ గానే సాగుతాయి. గతంలో చూసినా అదే రకమైన పరిస్థితి. ఇపుడూ అదే సీన్ కనిపిస్తోంది. అయితే ఈసారి ఎక్కువగా తిరువూరు కనిపిస్తోంది. తిరువూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ విజయవాడ ఎంపీగా పీక్స్ చేసిన వివాదంలో అధినాయకత్వం ఏమి చేయబోతోంది అన్నది ఒక్క పక్కన ఆసక్తిని రేపుతూంటే దాని కంటే ముందే కూటమి ఫీల్డ్ లోకి దిగిపోయింది.
ఆయన లేకుండానే :
ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లా కూటమి ముఖ్య నేతల సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించారు. ఇది కో ఆర్డినేషన్ మీటింగ్ పేరుతో అనేక విషయాలు చర్చించడానికి అని బయటకు చెబుతున్నా అసలు మ్యాటర్ కొలికపూడి అని అంటున్నారు. ఈ సమావేశానికి జనసేన బీజేపీ నాయకులు టీడీపీ కీలక నేతలు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని రవీంద్ర, జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం, అలాగే ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, వర్ల కుమార రాజా, బొడె ప్రసాద్, వసంత కృష్ణ ప్రసాద్, కీలక నేతలు బోండా ఉమా మహేశ్వరరావు, మండలి బుద్ధ ప్రసాద్, జనసేన జిల్లా ప్రెసిడెంట్ సామినేని ఉదయభాను, బీజేపీకి చెందిన జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ మొత్తం మీటింగ్ లో జిల్లా నేతలు అంతా హాజరైనా కొలికపూడి శ్రీనివాస్ మాత్రం హాజరు కాలేదు, మరి ఆయనను పిలిచారా లేక లేకుండానే మీటింగ్ పెట్టుకున్నారా అన్నది తెలియడం లేదు కానీ ఆయనదే అసలైన టాపిక్ అని అంటున్నారు.
దూరం పెట్టినట్లేనా :
ఇక చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాస్ చాలా కాలంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారని సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన పోకడ చూస్తే టీడీపీకి దూరంగా వెళ్తున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన విషయంలో కేవలం టీడీపీ మాత్రమే కాకుండా కూటమి మొత్తంగానే జాగ్రత్తగా ఉంటూ సరైన దిశగా ఏకాభిప్రాయంతో ఉండేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసారు అని అంటున్నారు.
వైసీపీ వాయిస్ తోనా :
ఇక కొలికపూడి వైసీపీ గొంతుకతో మాట్లాడుతున్నారని కూడా కూటమి నేతలు అనుమానిస్తున్నారుట. ఆయన గత పదహారు నెలలుగా సొంత పార్టీ నేతలతోనే పెద్దగా సఖ్యత కనబరచలేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయనకి టీడీపీలో కూడా మద్దతు దొరకడం లేదని అంటున్నారు. అందుకే ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరో వైపు చంద్రబాబు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఈ ఇష్యూని డీల్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. అయితే దాని కంటే ముందే కూటమి నేతలు అంతా సమావేశం కావడం కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి కొలికపూడి అయితే టీడీపీలో సౌఖ్యంగా లేకుండా ఉన్నారని అంటున్నారు. మరో వైపు ఆయనతో పార్టీ కూటమి కూడా అంత సౌఖ్యంగా లేదని చెప్పేందుకే ఈ తరహా మీటింగ్ ని ఏర్పాటు చేసారా అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.