• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైదరాబాద్ కు గుడ్ న్యూస్...

హైదరాబాద్ కు గుడ్ న్యూస్ చెప్పిన కిషన్ రెడ్డి!

| ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన రేవంత్ సర్కారు.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది.

By - Tupaki Desk
Update: 2025-01-19 04:29 GMT

రేవంత్ సర్కారు ఫోకస్ మొత్తం హైదరాబాద్ మహానగరం మీదనే ఉంది. దీనికి కారణం.. హైదరాబాద్ మహానగర రూపురేఖలు ఎంతలా మారిస్తే.. అంత రాబడితో పాటు.. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు సైతం తగ్గే వీలుంది. అధికారంచేతిలోకి వచ్చిన వేళ.. ఎడాపెడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కాస్త కష్టంగా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిరుత్సాహాన్ని కలిగించేలా మారాయి. ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన రేవంత్ సర్కారు.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది.

ఇందులో భాగంగా అవసరానికి మించిన యాక్షన్ ప్రదర్శించిన హైడ్రాకు ముకుతాడు వేయటం.. అదే సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలుగని రీతిలో దాన్ని నడిచేలా చేయటంతో పాటు.. మూసీ మీద జోరు తగ్గించి.. మూలన పడి ఉన్న మెట్రో ప్రాజెక్టుల ఫైళ్ల దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఇమేజ్ పెంచటంతో పాటు.. పడిన రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపు.. ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరుకు మెట్రోను భారీగా విస్తరించాలన్న ఆలోచన చేయటం తెలిసిందే.

ఇప్పటికే దీనికి సంబంధించిన పలు రూట్లను ప్రభుత్వం టేకప్ చేయటమే కాదు.. కేంద్రం నుంచి అనుమతులు త్వరగా వచ్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున మంతనాలు నడుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. డెవలప్ మెంట్ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారుతో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తూ.. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల్ని కేంద్రం మోకాలడ్డకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మెట్రో ప్రాజెక్టుల అనుమతులను కేంద్రం త్వరగా ఇప్పించేలా వ్యవహరిస్తున్నారు.

దీని ఫలితం అన్నట్లుగా తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సాయం చేస్తుందని.. అది తమ బాధ్యతగా పేర్కొన్నారు. రాజకీయంగా రేవంత్ సర్కారు మీద విమర్శలు సంధిస్తూనే.. తెలంగాణ రాష్ట్ర డెవలప్ మెంట్ కు అవసరమైన మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన సాయం కేంద్రం నుంచి తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి చెప్పిన మాట మీదే కేంద్రం కాని నిలిస్తే.. నాలుగేళ్ల వ్యవధిలో హైదరాబాద్ మహానగరంలో దాదాపు 150 కి.మీ. పైగా కొత్త మెట్రో రైలు మార్గం వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ లో సహకారం అందిస్తామన్న కిషన్ రెడ్డి మాటలు నిజమైతే.. హైదరాబాద్ కు అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?

Tags:    
  • Hyderabad 
  • Hyderabadpeople 
  • Realestate 
  • Hyderabadlands 
  • Congressparty 
  • Bjp 
  • Revanthreddy 
  • Revanthgovernment 
  • Kishanreddy 
  • Hydra 
  • Hyderabadmetro 
  • Metrotrains 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS